Guntur Kaaram: దీపావళికి టీజర్, క్రిస్మస్‌కు ట్రైలర్.. టైం ఫిక్స్..?

కేవలం 15 రోజుల టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైతే, ఇక మిగిలేది 3 పాటల షూటింగ్ మాత్రమేనట. అంటే మొత్తంగా మరో 30 రోజుల్లో పాటలు, టాకీపార్ట్ షూటింగ్ పూర్తవుతుందని క్లారిటీ వచ్చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 25, 2023 | 04:57 PMLast Updated on: Oct 25, 2023 | 4:57 PM

Guntur Kaaram Shooting Will Complete Soon

Guntur Kaaram: త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్‌లో మహేశ్ బాబు వేగం పెంచాడు. గుంటూరు కారం షూటింగుకి గుమ్మడి కాయ కొట్టే టైం వచ్చందంటున్నాడు. కేవలం 15 రోజుల టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైతే, ఇక మిగిలేది 3 పాటల షూటింగ్ మాత్రమేనట. అంటే మొత్తంగా మరో 30 రోజుల్లో పాటలు, టాకీపార్ట్ షూటింగ్ పూర్తవుతుందని క్లారిటీ వచ్చేసింది.

ఇక మిగిలింది ప్రమోషన్. అదే దీపావళికి మొదలయ్యేలా ఉంది. ఈ నెలాఖరికి సాంగ్ రిలీజ్ అనుకున్న టీం దీపావళికి టీజర్ లాంచ్ చేయబోతోంది. క్రిస్మస్ కి ట్రైలర్ ని విడుదల చేయాలన్న ప్లానింగ్ నడుస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇక జనవరి 3 కి ప్రీరిలీజ్ఈవెంట్‌ని గుంటూరులో ప్లాన్ చేశారు. మొత్తంగా గుంటూరు కారం షూటింగ్ కథ కంచికి చేరుతోంది. డిసెంబర్ 10 లోగా షూటింగ్ పూర్తి చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్ అట.

అంతేకాదు ప్రమోషన్ ని దీపావళికి మొదలు పెట్టి, ఈవెంట్లని డిసెంబర్ 31, జనవరి 3 కి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అలానే మహేశ్ బాబు కూడా తన ఫ్యామిలీతో జనవరి ఫస్ట్ వీక్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. అంటే 4 కి ఫారెన్ వెళ్లి 10 కి రిటర్న్ అవుతాడట. ఈ ప్లానింగ్ చూస్తుంటే, దీపావళి నుంచి సంక్రాంతి వరకు వరుస అప్ డేట్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ వచ్చేలా ఉంది.