Guntur Karam : మహేశ్ కోసం.. పవన్ సాయం..
గుంటూరు కారం మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడు. కేవలం సినిమా లో హీరో ఇంట్రడక్షన్ కే కాదు, సినిమాలో దాదాపు ఎనిమిది చోట్ల పవన్ వాయిస్ ఓవర్ చెబుతాడట.

Guntur Karam is Trivikrams movie with superstar Mahesh Babu Power star Pawan Kalyan is going to do the voice over for this movie
మహేశ్ బాబు కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్నమూవీ గుంటూరు కారం. ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటని హైద్రాబాద్ ఔట్ స్కట్స్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీస్తున్నారు. టాకీ పార్ట్ 25 శాతం పూర్తైంది. ఐతే కొత్త అప్ డేట్ ఏంటంటే ఈ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడు. కేవలం సినిమా లో హీరో ఇంట్రడక్షన్ కే కాదు, సినిమాలో దాదాపు ఎనిమిది చోట్ల పవన్ వాయిస్ ఓవర్ చెబుతాడట.
గుంటూరు కారం కోసం అడుగు ముందుకేసిన పవన్..
గతంలో పవన్ తో త్రివిక్రమ్ తీసిన జల్సా మూవీకి ఇలానే మహేశ్ బాబు కూడా వాయిస్ ఓవర్ చెప్పాడు. పవన్ పాత్రని పరిచయం చేయటంతో పాటు చాలా సీన్స్ కి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ వాడారు. ఐతే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కోసం రంగంలోకి దిగటం తో సాయానికి ప్రతి సాయం అంటున్నారు
జల్సా ట్రెండ్ ని ఇద్దరు హీరోలు రిపీట్ చేస్తున్నారా.. ?
ఈ రెండు సంఘటనలకు త్రివిక్రమే కారణం అనంటున్నారు. కాని నిజానికి పవన్,మహేశ్ మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరి గురించి ఒకరు చెప్పిన మాటల పరంగా చూస్తే మహేశ్ మీద పవన్ కి, పవర్ స్టార్ అంటే మహేశ్ కి ఉన్న ప్రత్యేక అభిమానం తెలిసిపోతుంది. ఏదేమైనా అప్పట్లో సోషల్ మీడియా లేదు కాని, ఉంటే జల్సాకి మహేశ్ వాయిస్ ఓవరంటే సోషల్ మీడియాఊగిపోయేది.. సరే ఇప్పుడు సీన్ రిపీట్ అవుతోంది. కాకపోతే మహేశ్ మూవీకి పవన్ వాయిస్ ఓవర్.. అదే జరిగితే ఇక ఇద్దరు హీరోల ఫ్యాన్స్ లో పూనకాలే..