GUNTUR KARAM: ఆ పాటని కుర్చీ మడత పెట్టి తిట్టేస్తున్న ఫ్యాన్స్
యూ ట్యూబ్‌లో ఓ పెద్దాయన మడత పెట్టి అంటూ ఇచ్చిన బూతు స్టేట్‌మెంట్ పాటలో పెట్టడం ఏంటని ఇప్పటికే జనాలు మండిపడుతున్నారు. ఒకరైతే తనని, తన సొంత కూతురు ఈ కుర్చీ మడతపెట్టి అన్న పాటకు ఎందుకు అంతలా అంత రియాక్డ్ అవుతున్నారని అడిగిందట.
GUNTUR KARAM: గుంటూరు కారం విషయంలో మాట మాటికి ట్రోలింగ్‌కి గురౌతున్నారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇప్పుడా లిస్ట్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరాడు. గుంటూరు కారం మూవీ గ్లింప్స్ వచ్చినప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్‌ని తిట్టిపోశారు ఫ్యాన్స్. తర్వాత మొదటి సాంగ్ దమ్ మసాలా వచ్చింది. తమన్ పేరు ట్రోలైంది. రెండో పాట బేబీ రిలీజైంది. ఫ్యాన్స్‌కి మండి ఆ పాటేంది.. దిక్కుమాలిన ఆ లిరిక్స్ ఏందని తిట్టిపోశారు.
Rajinikanth: పడి లేచిన కెరటాళ్లా దూసుకెళ్ళిన పాన్ ఇండియా స్టార్స్
దీంతో మండిన రామజోగయ్య కాస్త ఘాటూగానే ట్వీట్లు పెట్టి తర్వాత ఫ్యాన్స్ నుంచి కౌంటర్లు వస్తే తోకముడిచాడు. ఇప్పడు అతి కష్టంమీద మూడో పాట వచ్చింది. కట్ చేస్తే ఇదో బూతుపాటంటూ, రామజోగయ్య శాస్త్రి సరస్వతి పుత్రుడు కాదు, బూతు పుత్రుడంటూ ట్రోలింగ్ పెంచారు. యూ ట్యూబ్‌లో ఓ పెద్దాయన మడత పెట్టి అంటూ ఇచ్చిన బూతు స్టేట్‌మెంట్ పాటలో పెట్టడం ఏంటని ఇప్పటికే జనాలు మండిపడుతున్నారు. ఒకరైతే తనని, తన సొంత కూతురు ఈ కుర్చీ మడతపెట్టి అన్న పాటకు ఎందుకు అంతలా అంత రియాక్డ్ అవుతున్నారని అడిగిందట. దానికి ఏం చెప్పాలో తేల్చుకోలేకపోయానన్నాడు.
అయినా త్రివిక్రమ్ బుద్ది ఎటు పోయిందంటూ తనని గురూజీ అనే వాళ్లని తిడుతూ, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు నెటిజన్స్. నిజానికి డైరెక్టర్ అనుమతి లేకుండా అలాంటి పద ప్రయోగం రైటర్ చేసే ఛాన్స్ లేదు. అక్కడే అటు రామజోగయ్య శాస్త్రిని, ఇటు త్రివిక్రమ్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మూడో పాటకి ట్రోలింగ్ లేదుగా అని అనుకుని 24 గంటలు దాటలేదు.. అంతలోనే ట్రోలింగ్ టోనే మారిపోయింది.