Guntur Karam movie : ఒక రోజు ముందే రిలీజ్.. గుంటూరు కారం
గుంటూరు కారం సాంగ్ ఏడో తేదీనా రాబోతోంది. లీకైన పాటనే ఫిల్మ్ టీం రివీల్ చేయబోతోందట. నిజానికి అది కాకుండా మరో పాటని లాంచ్ చేద్దామంటే, ఈలోపు మరో పాట లీకైంది. అందుకే రెండు పాటల్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో నిర్మాత ఆలోచించడంతో ఇప్పుడు నిర్ణయం మహేష్ కోర్టులో ఉంది..

Guntur Karam movie release date is changing It seems that the release of this movie is being preponed to January 11 instead of January 12
గుంటూరు కారం రిలీజ్ డేట్ లో సడన్ ఛేంజ్..
గుంటూరు కారం మూవీ రిలీజ్ డేట్ మారుతోంది. జనవరి 12 న కాకుండా జనవరి 11 కి ఈసినిమా విడుదల ప్రీపోన్ అవుతోందని తెలుస్తోంది. దీనికి కారణం గుంటూరు కారం సాంగ్ లీకవ్వటమేనా? ఏదేమైనా త్రివిక్రమ్ మేకింగ్ లో మహేశ్ బాబు చేసిన సినిమా విడుదలకు సిద్దమైంది. సంక్రాంతికి సోలోగా సూపర్ స్టార్ సందడే ఉండేలా ఉంది.
పోస్ట్ పోన్ కాదు ప్రీ పోన్ అంటున్న ఫిల్మ్ టీం..
ఐతే గుంటూరు కారం ఆడియో లీకేజ్ తో జరిగిన డ్యామేజ్ ని రెండు రకాలుగా మార్చబోతోంది ఫిల్మ్ టీం. ఒకటి త్రివిక్రమ్ బర్త్ డే అయిన నవంబర్ 7న గుంటూరు కారం సాంగ్ ని లాంచ్ చేయటం.. రెండు ఒకే రోజు రెండు పాటలను లాంచ్ చేయడం.. ఈ రెండు ఆలోచనలు మహేశ్ ముందు పెట్టాడడట నిర్మాత.
సాంగ్ లీకేజ్ తర్వాత సడన్ గా కొత్త మార్పులు..
గుంటూరు కారం సాంగ్ ఏడో తేదీనా రాబోతోంది. లీకైన పాటనే ఫిల్మ్ టీం రివీల్ చేయబోతోందట. నిజానికి అది కాకుండా మరో పాటని లాంచ్ చేద్దామంటే, ఈలోపు మరో పాట లీకైంది. అందుకే రెండు పాటల్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో నిర్మాత ఆలోచించడంతో ఇప్పుడు నిర్ణయం మహేష్ కోర్టులో ఉంది..
ఇక గుంటూరు కారం జనవరి 12 న కాకుండా 11 నే విడుదలవ్వటానికి కారణం థియేటర్ల ఎవైలబిలిటి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కోలీవుడ్ లో కూడా ఈ సారి పొంగల్ కి పోటీ ఇచ్చే సినిమాలేవీ లేవు.. ఒకటి అర పోటీ కొచ్చే మూవీలు పక్కన పెడితే, తమిళ నాట భారీ సంఖ్యలో థియేటర్స్ దొరకటంతో ఫిల్మ్ టీం ఈనిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.