Guntyr karam : గుంటూరు కారంOST రిలీజ్ అప్పుడే..!

సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..మహేశ్-త్రివిక్ర‌మ్ (Mahesh-Trivikram) కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌చ్చిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వ‌చ్చిన మూవీ కావ‌డంతో గుంటూరు కారం మూవీపై భారీ హైప్ ఏర్ప‌డింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2024 | 01:15 PMLast Updated on: Feb 15, 2024 | 1:15 PM

Guntur Karam Ost Release Just Now

సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..మహేశ్-త్రివిక్ర‌మ్ (Mahesh-Trivikram) కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌చ్చిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వ‌చ్చిన మూవీ కావ‌డంతో గుంటూరు కారం మూవీపై భారీ హైప్ ఏర్ప‌డింది. అయితే, ఎన్నో అంచనాలతో విడుదలైన గుంటూరు కారం సినిమాకు మొదటి షో నుంచి మిక్స్‌డ్ టాక్, రివ్యూలు వచ్చాయి. సినిమా ఏం బాలేదని, త్రివిక్రమ్ మ్యాజిక్ ప‌ని చేయ‌లేదంటూ ఫ్యాన్సే కామెంట్లు పెట్టారు. అయితే, గుంటూరు కారం సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా మహేశ్ మేనియాతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. దాంతో నెలరోజుల్లోనే గుంటూరు కారం మూవీనీ ఓటీటీ (OTT) లోకి తీసుకొచ్చారు. డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ చిత్రానికి సంబంధించిన OST రిలీజ్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను షేర్ చేశారు.
మహేష్ బాబు అభిమాని ఒక‌రు చేసిన ఎడిట్‌కి థ‌మ‌న్ రెస్పాండ్ అయ్యారు. క్రేజీ ఎడిట్, గుంటూరు కారం OST క్రేజీ గా వస్తుంది. 25 కి పైగా ట్రాక్స్ ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 29 వ తేదీన ఈ OST రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. థమన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది త‌మ‌కు గుడ్ న్యూస్ అంటూ మ‌హేశ్ ఫ్యాన్స్ థ‌మ‌న్ పోస్ట్‌పై కామెంట్లు పెడుతున్నారు. OST కోసం వెయిటింగ్ అంటూ హ‌డావిడి చేస్తున్నారు.

అయితే.. మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ గుంటూరు కారం మూవీకి ఈ రేంజ్ క్రేజ్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ మూవీకి సంబంధించి త్రివిక్ర‌మ్ పై విపరీత‌మైన నెగ‌టివిటీ స్ప్రెడ్ అయిన‌ప్ప‌టికీ.. మ‌హేశ్ పర్ఫామెన్స్ కి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ స్టైలింగ్‌కి ప‌డిపోయారు. ముఖ్యంగా డ్యాన్స్ ఇరగదీశాడని, డ్యాన్స్‌లో మహేశ్ బాబు విశ్వరూపం చూపించాడని ప్రంశంసలు కురిపించారు. ఫ‌స్ట్‌షో నుంచే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఓ మూవీకి ఈ రేంజ్ క్రేజ్ రావ‌డం.. మ‌హేశ్ బాబు స్టామినాకి నిద‌ర్శ‌న‌మంటున్నారు.