GUNTUR KAARAM: గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ గెస్టుగా పవన్..?
ఈ ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్‌గా మాత్రమే కాకుండా.. ట్రైలర్ లాంచ్ చేసే బాధ్యత కూడా పవర్ స్టార్ మీద పెట్టింది త్రివిక్రమ్ టీం. బేసిగ్గానే పవర్ స్టార్, సూపర్ స్టార్ మధ్య మంచి స్నేహం ఉంది. జల్సాకి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

GUNTUR KAARAM: గుంటూరు కారం మూవీ టీం.. ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం ప్లాన్ చేసింది. అదే రోజు ట్రైలర్ లాంచ్ చేయబోతోంది. ఇక ఈ ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్‌గా మాత్రమే కాకుండా.. ట్రైలర్ లాంచ్ చేసే బాధ్యత కూడా పవర్ స్టార్ మీద పెట్టింది త్రివిక్రమ్ టీం. బేసిగ్గానే పవర్ స్టార్, సూపర్ స్టార్ మధ్య మంచి స్నేహం ఉంది. జల్సాకి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పవన్ కూడా మహేశ్ మూవీకి ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచాడు.
Hanuman Pre-Release Event : హనుమాన్ కోసం, మెగాస్టార్, ప్రభాస్..?
ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి కూడా సూపర్ స్టార్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. దీనికి తోడు త్రివిక్రమ్.. పవర్ స్టార్‌కి గురూజీ కూడా. ఆ కోణంలో కూడా తన మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కి పవన్ రావటం వింతేం కాదు. కాకపోతే ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ మంచి జోరుమీదున్నాయి. పవన్ కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకోసం తన సినిమాల షూటింగ్స్‌ని కూడా ఆపేసుకున్నాడు. అంత బిజీగా ఉన్న పవన్.. గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్‌కి వస్తాడా..? ఆ డౌట్లు ఏమీ వద్దు అంటోంది సినిమా యూనిట్.
పవన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. కాని, శనివారం పవన్ రాక డౌట్‌లో ఉంది. శనివారం సాయంత్రం ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ మధ్యాహ్నంలోగా వాయిదా కూడా పడొచ్చట. ఒకవేళ పవన్ రాక డౌటే అయితే శనివారం మధ్యాహ్నం తేలిపోతుంది. సో.. అదే నిజమైతే, ఆదివారానికి ఈ ఈవెంట్‌ని వాయిదా వేసేందుకు కూడా ప్లాన్ బీని రెడీ చేశాడట మాటల మాంత్రికుడు.