Guntur Karam : గుంటూరు కారం ట్రైలర్ అప్డేట్

ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ, సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 04:16 PMLast Updated on: Dec 18, 2023 | 4:16 PM

Guntur Karam Trailer Update

 

ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ, సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుండి మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్, సాంగ్స్ అంచనాలు పెంచేయగా.. ట్రైలర్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ పై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం మూవీ ట్రైలర్ జనవరిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో మహేష్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల, ఖిలాడీ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.