Guntur karam : ‘గుంటూరు కారం’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ (Superstar) మహేష్ (Mahesh Babu), మాటల మాంత్రికుడు కాంబోలో రీసెంట్‌గా వచ్చిన మూవీ గుంటూరు కారం (Guntur Karam).. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల (Srileela) నటించగా, హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు.

'Guntur Karam' World Television Premiere Date Fix
సూపర్ స్టార్ (Superstar) మహేష్ (Mahesh Babu), మాటల మాంత్రికుడు కాంబోలో రీసెంట్‌గా వచ్చిన మూవీ గుంటూరు కారం (Guntur Karam).. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల (Srileela) నటించగా, హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా.. మహేష్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.. మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇ ప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ బజ్ మహేశ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
గుంటూరు కారంలో త్రివిక్రమ్ (Trivikram Srinivas) మార్కు మిస్ అయ్యిందంటూ అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ నడించింది. పాటలు, కథ, కథనంపై విపరీతమైన నెగటివిటీ వచ్చినప్పటికీ.. భారీ కలెక్షన్లతో మహేశ్ బాబు తన స్టామినా ఏమిటో మరోసారి తన స్టానిమా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. పండగ సెలవులలో మంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి ఎబోవ్ యావరేజ్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోనూ అదరగొట్టింది. చాలా రోజుల పాటు ఓటీటీ టాప్ లిస్టులో చోటు సంపాదించుకోవడమే కాకుండా హిందీ వెర్షన్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. రమణ గాడుగా మాస్ క్యారెక్టర్ లో మహేష్ బాబు మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ద్వారా టీవీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా ఏప్రిల్ 7న సాయంత్రం 6 గంటలకు ప్రముఖ జెమినీ టీవీ ఛానెల్‌లో ప్రీమియర్‌గా ప్రసారం కానుందని తెలుస్తోంది. మరి థియేటర్లలోనూ, ఓటీటీలోనూ అదరగొట్టిన గుంటూరు కారం సినిమాకి బుల్లితెర పై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అక్కడ కూడా తమ అభిమాన హీరో సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు.