టాలీవుడ్ కి జుట్టు సెంటిమెంట్… లాంగ్ హెయిర్ ఉంటే బ్లాక్ బస్టర్
సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు డైరెక్టర్ లు. ఒక్కో సినిమా కోసం ఒక్కో విధంగా రెడీ అవుతూ ఉంటారు. ఒకప్పుడు సినిమాల్లో మీసాలు బాగా హైలెట్ అయ్యేవి. ఆ తర్వాత సిక్స్ ప్యాక్ అంటూ అది ఫాలో అయ్యారు.
సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు డైరెక్టర్ లు. ఒక్కో సినిమా కోసం ఒక్కో విధంగా రెడీ అవుతూ ఉంటారు. ఒకప్పుడు సినిమాల్లో మీసాలు బాగా హైలెట్ అయ్యేవి. ఆ తర్వాత సిక్స్ ప్యాక్ అంటూ అది ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు జుట్టు సెంటిమెంట్ గట్టిగా నడుస్తోంది. సిన్నిమాల్లో జుట్టు ఉంటే చాలా సినిమా సూపర్ హిట్. ముఖ్యంగా లాంగ్ హెయిర్ తో ఇప్పుడు డైరెక్టర్లు తమ హీరోలను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కంటే ఇది ఇప్పుడు ఎక్కువగా కనపడుతోంది సినిమాల్లో.
బాహుబలి సినిమాలో ప్రభాస్ లాంగ్ హెయిర్ తోనే కనిపించాడు ఓ మాదిరిగా. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక కేజిఎఫ్ సినిమాలో యష్ ని లాంగ్ హెయిర్ తో చూపించాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయి కొత్త రికార్డులు నమోదు చేసింది. అలాగే పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ అలాగే కనిపించాడు. ఆ పిచ్చి జుట్టుతోనే సూపర్ హిట్ కొట్టాడు. కల్కీ సినిమాతో ప్రభాస్ కూడా లాంగ్ హెయిర్ తో కనిపించి సూపర్ హిట్ కొట్టాడు. ఇలా స్టార్ హీరోలు తమ తర్వాతి సినిమాలకు కూడా జుట్టు పెంచుతున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు… రాజమౌళి తో సినిమా కోసం లాంగ్ హెయిర్ తో కనిపించాడు. దేవర సినిమాలో ఎన్టీఆర్ కూడా కాస్త జుట్టు ఎక్కువే పెంచాడు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా కోసం కూడా ఎన్టీఆర్ కొంచెం జుట్టు పెంచే అవకాశం కనపడుతోంది. సందీప్ రెడ్డి వంగా చేసిన బాలీవుడ్ సినిమా యానిమల్ లో కూడా హీరో జుట్టుతో అలరించాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా… ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఎక్కువగా జుట్టు పెంచే అవకాశం ఉంది ప్రభాస్. దీనికి సంబంధించి కొన్ని లుక్స్ కూడా డిజైన్ చేసాడు సందీప్.
పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ ఎక్కువ జుట్టుతోనే కనిపిస్తాడు. ఇప్పుడు ఈ జుట్టు లేదా గడ్డం సెంటిమెంట్ సినిమాలకు బాగా వర్కౌట్ అవుతోంది. అటు చిన్న హీరోలు కూడా ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. మరి భవిష్యత్తు సినిమాలు ఇంకెలా ఉంటాయో చూడాలి. ఒకప్పుడు హీరో స్మార్ట్ గా ఉంటే సినిమా సూపర్ హిట్. ఇప్పుడు ఎంత మొరటుగా ఉంటే అంత హిట్ అనే మాట వినపడుతోంది. అందుకే స్టార్ హీరోలను కాస్త మొరటుగా మారుస్తున్నారు డైరెక్టర్లు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు అందరూ లాంగ్ హెయిర్ తో సందడి చేస్తున్నారు.