హనూ… ఈ అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు గురూ…?

ఏ సినిమా అయినా జనాల్లో మౌత్ టాక్ బాగా తెచ్చుకోవాలంటే హీరోయిన్ పాత్ర కూడా కీలకం. హీరోయిన్ ను ఎంత బాగా చూపించారు, హీరోయిన్ ఎంత బాగా నటించింది అనేవి జనాలు బాగా గమనిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2024 | 06:30 PMLast Updated on: Aug 20, 2024 | 6:30 PM

Hanu Where Do You Find These Girls Guru

ఏ సినిమా అయినా జనాల్లో మౌత్ టాక్ బాగా తెచ్చుకోవాలంటే హీరోయిన్ పాత్ర కూడా కీలకం. హీరోయిన్ ను ఎంత బాగా చూపించారు, హీరోయిన్ ఎంత బాగా నటించింది అనేవి జనాలు బాగా గమనిస్తారు. ముఖ్యంగా క్లాస్ సినిమాలకు హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. హీరోయిన్ పాత్రపై దర్శకుడు శ్రద్ధ పెడితే కచ్చితంగా సినిమాకు మంచి మార్కులు పడతాయి. అలాంటి దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. మరి ఆయనకు హీరోయిన్లు ఎక్కడ దొరుకుతారో తెలియదు గాని… ఒక్కో హీరోయిన్ ను ఆయన సెలెక్ట్ చేసుకునే విధానం మాత్రం పిచ్చి ఎక్కిస్తుంది.

అందాల రాక్షసి సినిమాలో ఆయన హీరోయిన్ తో ముద్దు ముద్దుగా మాట్లాడించారు. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి టాక్ ఆఫ్ ది డౌన్ అయిపొయింది. కుర్రాళ్ళు చాన్నాళ్ళు ఆమె ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. “నాకు పెళ్లి చేసేయండి నాన్న” అంటూ ఆమె అందంగా పలికిన విధానం చాలా మంది అమ్మాయిలకు కూడా నచ్చేసింది. ఆ తర్వాత క్రిష్ణగాడి వీర ప్రేమ గాద సినిమాలో మేహ్రీన్… ఈమెతో కూడా మంచి మంచి డైలాగులు పలికించాడు హను రాఘవపూడి. ఆ సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది. ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని భావించారు గాని కాలేదు.

తర్వాత లై అనే సినిమాలో మేఘా ఆకాష్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక సీతారామం సినిమాలో సీత హైలెట్. “ మళ్ళీ మొదలు” అంటూ ఆమె క్యూట్ క్యూట్ గా మాట్లాడటం జనాలకు ఓ రేంజ్ లో నచ్చేసింది. ఆ సినిమాలో ఆమెను చూపించిన పద్దతికి అయితే టాలీవుడ్ జనాలు ఏంటీ బాలీవుడ్ జనాలు కూడా ఫిదా అయిపోయారు. ఆమె హైట్ కి కుర్రాళ్ళకు మతి పోయింది. కట్ చేస్తే ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఇమాన్వీ అనే ఒక అమ్మాయిని తెచ్చాడు హనూ. ప్రభాస్ పక్కన ఆమెను సెలెక్ట్ చేసాడంటే… ఆమెను ఏ రేంజ్ లో చూపిస్తాడో అనే ఆసక్తి పెరిగిపోయింది. ఇలా హీరోయిన్ సెలెక్షన్ విషయంలో హనూ దుమ్మురేపుతున్నాడు.