Hanuman : కేజీఎఫ్, కాంతార రికార్డులు బద్దలు కొట్టిన ‘హనుమాన్’
అసలు హనుమాన్ మూవీ (Hanuman Movie) కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో హనుమాన్ దెబ్బ మామూలుగా లేదు. నార్త్ అమెరికా (North America) లో 3.5 మిలియన్ డాలర్స్‌కు పైగా రాబట్టి.. తెలుగు సినిమాల్లో ఆల్ టైం టాప్ 6లోకి ఎంటర్ అయింది.

'Hanuman' broke KGF and Kantara records
అసలు హనుమాన్ మూవీ (Hanuman Movie) కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో హనుమాన్ దెబ్బ మామూలుగా లేదు. నార్త్ అమెరికా (North America) లో 3.5 మిలియన్ డాలర్స్‌కు పైగా రాబట్టి.. తెలుగు సినిమాల్లో ఆల్ టైం టాప్ 6లోకి ఎంటర్ అయింది. ఇక నార్త్ బెల్ట్‌లో అయితే కెజియఫ్ చాప్టర్ 1, కాంతార రికార్డును బ్రేక్ చేసింది హనుమాన్. అయోధ్య కార్యక్రమం వల్ల హిందీలో మరింత ఆదరణ దక్కుతోంది. వారం రోజుల్లోనే 23 కోట్లు వరకూ నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది. దీంతో ఫస్ట్ వీక్‌లో కేజీఎఫ్, కాంతార రికార్డు బద్దలైంది.
కేజీఎఫ్ చాప్టర్1 (KGF Chapter 1) వారం రోజుల్లో 20 కోట్లు నెట్ వసూలు చేయగా.. ‘హనుమాన్’ ఆరు రోజుల్లోనే ఈ మార్క్ దాటేసింది. అలాగే, ‘కాంతార’ (Kantara) ఫస్ట్ వీక్ వసూళ్లను 4 రోజుల్లోనే బద్దలు కొట్టింది. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర కార్యక్రమం ఉంది కాబట్టి.. హిందీలో 50 కోట్ల మార్కును చేరే అవకాశం ఉందంటున్నారు. ఇక వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ వీక్‌లో 130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది హనుమాన్. దీంతో సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి.. వారం రోజుల్లోనే నిర్మాతలకు నలభై కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది హనుమాన్. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Varma) తెరకెక్కించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేసింది. ఏదేమైనా హనుమాన్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి.