HANUMAN: హనుమాన్ దర్శకుడికి 100 కోట్ల బంపర్ ఆఫర్..
హనుమాన్ సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్న ఈ దర్శకుడికి, టీసీరీస్ సంస్థ ఆ ప్రాజెక్ట్‌ని టేకోవర్ చేసేందుకు రెడీ అంటోంది. నిర్మాతతో మాట్లాడి రంగంలోకి దిగేందుకు సిద్దపడింది. తమ ఈ ఆఫర్‌కి సై అంటే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని ఆఫర్ చేస్తోంది.
HANUMAN: హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.260 కోట్లని కేవలం 18 రోజుల్లో రాబట్టింది. నెలలోగా రూ.300 కోట్ల వసూళ్లను కూడా రీచ్ అయ్యేలా ఉంది. అలా పాన్ ఇండియా లెవల్లో తనేంటో ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మకి నార్త్ నుంచి బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి. టీ సీరీస్ సంస్థ ఈ దర్శకుడికి రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చిందట.
DEVARA: కొరటాల శివ చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్న తారక్
హనుమాన్ సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్న ఈ దర్శకుడికి, టీసీరీస్ సంస్థ ఆ ప్రాజెక్ట్‌ని టేకోవర్ చేసేందుకు రెడీ అంటోంది. నిర్మాతతో మాట్లాడి రంగంలోకి దిగేందుకు సిద్దపడింది. తమ ఈ ఆఫర్‌కి సై అంటే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని ఆఫర్ చేస్తోంది. వీటి వల్ల దర్శకుడికి రూ.100 కోట్ల వరకు గిట్టుబాటు అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు, హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో హనుమంతుడి పాత్రకు, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్ ఇలా ఎవరి డేట్లు కావాలన్నా ఇప్పిస్తానంటోంది టీ సీరీస్ సంస్థ.
కానీ, ప్రశాంత్ వర్మ మాత్రం చిరునే హనుమంతుడి పాత్రలో, మహేశ్‌నే రాముడి పాత్రలో గెస్ట్ రోల్‌కి ఒప్పించాలనుకుంటున్నాడు. ఏదేమైనా హనుమాన్ హిట్‌తో ప్రశాంత్ వర్మ కెరీర్ గ్రాఫే మారిపోయింది. హనుమాన్ మూవీ.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన సంగతి తెలిసిందే.