Hanuman : హనుమాన్ కలెక్షన్ల సునామీ.. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు
హనుమంతుడి (Hanuman) నోటి నుండి వచ్చే రామ నామానికి ఎంతటి శక్తి ఉంటుందో ఇప్పుడు ప్రేక్షకుల నోటి నుంచి వస్తున్న జై హనుమాన్ (Jai Hanuman) నామానికి అంతే శక్తీ ఉందని ఇండియన్ బాక్స్ ఆఫీస్ (Indians Box Office) కి క్లియర్ గా అర్ధమైంది.

Hanuman is a Telugu movie that is pouring a tsunami of collections of 250 crores
హనుమంతుడి (Hanuman) నోటి నుండి వచ్చే రామ నామానికి ఎంతటి శక్తి ఉంటుందో ఇప్పుడు ప్రేక్షకుల నోటి నుంచి వస్తున్న జై హనుమాన్ (Jai Hanuman) నామానికి అంతే శక్తీ ఉందని ఇండియన్ బాక్స్ ఆఫీస్ (Indians Box Office) కి క్లియర్ గా అర్ధమైంది. జనవరి 12న వరల్డ్ వైడ్ గా విడుదలైన హనుమాన్ మూవీ కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంది. విడుదలైన రోజు నుంచి నేటి వరకు ఒక సెంటర్ అని కాదు అన్ని సెంటర్స్ లోను ఫుల్ క్రౌడ్ తో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా హనుమాన్ సాధించిన కలెక్షన్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
హనుమాన్ 250 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ ఆ స్థాయి కలెక్షన్స్ ని సాధించడం ఒక రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటికి థియేటర్స్ దగ్గర హడావిడీ తగ్గడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీస్ అందరు కలిసి హనుమాన్ చూడటానికి క్యూ కడుతున్నారు. అంతటితో ఆగకుండా హనుమాన్ చాలా బాగుందని తమకి తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. దీన్నిబట్టి హనుమాన్ ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో అర్ధం అవుతుంది.
పైగా హనుమాన్ ని ఎంత ఎక్కువ మంది ప్రేక్షకులు చూస్తే అయోధ్య రాముడికి (Ayodhya Ram Mandir) అంత లాభం. ఎందుకంటే హనుమాన్ ని వీక్షించే ప్రతి ప్రేక్షకుడు కొనే టికెట్ నుంచి 5 రూపాయిలు అయోధ్య రాముడి ఖాతాలోకి వెళ్తాయి. రీసెంట్ గా ఇప్పటివరకు అలా వచ్చిన 2 కోట్ల రూపాయిలకి పైనే అయోధ్య రాముడికి వెళ్లాయి. ఒక్కటి మాత్రం నిజం హనుమాన్ మూవీని మేకర్స్ ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో గాని ఇప్పట్లో హనుమంతుడి కలెక్షన్ల ప్రవాహం తగ్గేలా లేదు.