HANUMAN: యూఎస్‌లో హనుమాన్ రికార్డ్.. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సినిమా

తెలుగుకు సంబంధించి నైజాలో రూ.50 కోట్ల షేర్ మార్క్ దాటింది. ఇలా అనేక చోట్ల ఈ సినిమా.. పెద్ద సినిమాలను మించి రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో హనుమాన్ సంచలన విజయం సాధించింది. అక్కడ ఈ చిత్రం ఊహకందని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2024 | 09:22 PMLast Updated on: Jan 28, 2024 | 9:22 PM

Hanuman Movie Collected 5 Million Dollars In Us

HANUMAN: యంగ్ హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన సూపర్ హీరో చిత్రం “హనుమాన్”. ముందు నుంచి మంచి అంచనాలున్న ఈ చిత్రం ఇప్పుడు రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు వరకు వరల్డ్ వైడ్‌గా అద్భుతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

Rakul Preet Singh: రకుల్ పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే

తెలుగుకు సంబంధించి నైజాలో రూ.50 కోట్ల షేర్ మార్క్ దాటింది. ఇలా అనేక చోట్ల ఈ సినిమా.. పెద్ద సినిమాలను మించి రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో హనుమాన్ సంచలన విజయం సాధించింది. అక్కడ ఈ చిత్రం ఊహకందని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం యూఎస్ మార్కెట్‌లో ఏకంగా 5 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికాలోనే బడ్జెట్ రికవరీ చేసేస్తోందంటే.. ఈ సినిమా సాధించిన విజయం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఐదు మిలియన్ డాలర్లు అంటే.. హనుమాన్ సాధించింది రికార్డు మైల్ స్టోన్ అని చెప్పాలి. తెలుగుకు సంబంధించి యూఎస్‌లో ఆల్ టైం 5 టాప్ హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రంగా ఇది నిలిచింది.

హిందీలో రూ.50 కోట్ల నెట్ మార్క్ అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని కోటి మందికిపైగా వీక్షించారు. ఇది కూడా ఒక రికార్డే. ఈ సినిమాకు సంబంధించి ప్రతి టిక్కెట్‌పై రూ.5 అయోధ్య రామాలయానికి అందిస్తానని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.