HANUMAN: అరుంధతి మూవీని గుర్తుకు తెస్తున్న హనుమాన్ కలెక్షన్స్

గతంలో అరుంధతి మూవీ వచ్చినప్పుడు కూడా తెలుగు ప్రాంతాల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ కొనలేదట. దిల్ రాజు అప్పట్లో నో చెప్పాడట. యూఎస్ రైట్స్ రూ.50 లక్షలకే అమ్మాలనుకున్నా కొనేవాళ్లు రాకపోవటంతో తెలుగు ప్రాంతాల్లోనే రిలీజ్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2024 | 04:35 PMLast Updated on: Jan 29, 2024 | 4:37 PM

Hanuman Movie Collects 5 Mn In Us Remembers Arundathi

HANUMAN: హనుమాన్ మూవీ రికార్డులే కాదు, చాలా మంది అమాయకత్వాన్ని కూడా బ్రేక్ చేస్తోందంటున్నారు. హనుమాన్ ఓ చిన్న సినిమా. అలాంటిది పెద్ద మూవీల మధ్య నలిగిపోవటం ఎందుకని కామెంట్ చేసిన బ్యాచే ఇప్పుడు ఆలోచనలో పడేలా యూఎస్‌లో 5 మిలియన్లతో షాక్ ఇచ్చింది. వరల్డ్ వైడ్‌గా రూ.250 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ఇంకా వసూళ్లను రాబడుతూనే ఉంది. ఐతే ఈ మూవీ వల్ల దిల్ రాజు గతంలో చేసిన తప్పునే మరోసారి గుర్తుచేస్తోంది సోషల్ మీడియా బ్యాచ్.

PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులకు మోదీ సూచనలు

గతంలో అరుంధతి మూవీ వచ్చినప్పుడు కూడా తెలుగు ప్రాంతాల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ కొనలేదట. దిల్ రాజు అప్పట్లో నో చెప్పాడట. యూఎస్ రైట్స్ రూ.50 లక్షలకే అమ్మాలనుకున్నా కొనేవాళ్లు రాకపోవటంతో తెలుగు ప్రాంతాల్లోనే రిలీజ్ చేశారు. కానీ, మౌత్ టాక్ కిక్ ఇవ్వటంతో, రెండో రోజే కోటి 20 లక్షలు పెట్టి యూఎస్ రైట్స్ కొనేసి, అంతకు 20 రెట్లు లాభాలతో అప్పటి బ్యాచ్ సంబరం చేసుకుంది. ఇదే సమయంలో దిల్ రాజు 4 కోట్లతో కొనేందుకు ముందుకొచ్చినా శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం అమ్మేలేదట. అలానే కొనసాగించాడట. అచ్చంగా హనుమాన్ రైట్స్‌ని యూఎస్ బ్యాచ్ కొనేందుకు ముందుకు రాలేదట. నైజాంలోఅయితే దిల్ రాజు గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగమీద పెట్టిన ఫోకస్ హనుమాన్ మీద పెట్టలేదట.

కాని నా సామిరంగయా వరేజ్ సక్సెస్‌ని పక్కనపెడితే మిగతా రెండు పెద్ద సినిమాలను కాదని, హనుమాన్ రూ.250 కోట్లు రాబట్టింది. కేవలం యూఎస్‌లోనే 5 మిలియన్ల వసూళ్లను రాబట్టేసింది. అంతెందుకు.. గుంటూరు కారం మూవీని రిలీజ్‌కి ముందే చూసి.. సినిమా నచ్చి మహేశ్ అండ్ కోని తెగ పొడిడేసిన దిల్ రాజు జడ్జిమెంట్ తప్పని తేలింది. అరుంధతి విషయంలోనే కాదు హనుమాన్ విషయంలో దిల్ రాజు అభిప్రాయం తప్పుగా తేలిందనే చర్చ సోషల్ మీడియాలో పెరిగింది.