Hanuman Movie Review : హనుమంతు కుమ్మేశాడు భయ్యా..
అగ్రహీరోల నడుమ ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ట్రైలర్ లతోనే అంచనాలు పెంచిన మూవీ.. ప్రశాంత్ వర్మ తేజాసజ్జా ఖాతాలో హిట్ పడిందా లేదా అన్న మ్యాటర్ తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
అగ్రహీరోల నడుమ ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి (Sankranti) బరిలో నిలిచిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ట్రైలర్ లతోనే అంచనాలు పెంచిన మూవీ.. ప్రశాంత్ వర్మ (Prashant Verma) తేజాసజ్జా (Tejasajja) ఖాతాలో హిట్ పడిందా లేదా అన్న మ్యాటర్ తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
కథ వియానికి వస్తే.. హనుమంతు అయిన తేజ సజ్జ ది అంజనాద్రి గ్రామం (Anjanadri village) . అతను ఓ దొంగ. చిన్నప్పటి నుంచి మీనాక్షి అయిన అమృతా అయ్యర్ అంటే ప్రేమ. ఆమె డాక్టర్. వేసవి సెలవులకు తాతయ్య ఊరు అంజనాద్రి వస్తుంటుంది. అక్కడి ప్రజలకు వైద్యం చేస్తుంటుంది. ఊరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప పాలెగాడు అయిన రాజ్ దీపక్ శెట్టి అభివృద్ధిని పట్టించుకోడు. అతడిని ఎదిరించడంతో మీనాక్షికి ప్రమాదం ఎదురు అవుతుంది. దాన్నుంచి ఆమెను కాపాడే క్రమంలో హనుమంతుకు గాయాలు అవుతాయి. తెల్లారే సరికి గాయాలు మాయం అవుతాయి. సూపర్ పవర్స్ వస్తాయి. హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? అతని గురించి తెలిసి ఆ ఊరు వచ్చిన మైఖేల్ ఏం చేశాడు అంజమ్మ ,హనుమంతు.. అక్కా తమ్ముడి అనుబంధం ఏమిటి హనుమతుకు విభీషణుడు అయిన సముద్రఖని ఎటువంటి సాయం చేశాడు రుధిర మణి కథేంటి అనేది మిగతా సినిమా. పర్పామెన్స్ విషయానికి వస్తే.. తేజా అద్భుతంగా నటించాడు. బరువైన పాత్ర అయినప్పటికి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హనుమంతు పాత్రలో తేజ సజ్జ ఒదిగిపోయారు. కామెడీ, ఫైట్స్, ఎమోషన్.. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా చేశారు. క్యారెక్టర్ పరిధి దాటకుండా హీరోయిజం చూపించారు. అమృతా అయ్యర్ అందంగా కనిపించారు. నటిగానూ మెరిశారు. వరలక్ష్మి శరత్‌కుమార్ ఎప్పటిలాగానే తన పవర్‌ప్యాక్డ్ యాక్టింగ్ తో అదరగొట్టింది.. వినయ్ రాయ్ మరోసారి స్టైలిష్ విలన్ రోల్ చేశారు. విభీషణుడిగా సముద్రఖని హుందగా నటించారు.
టెక్నికల్ విషయానికి వస్తే.. రెగ్యులర్ కామన్ స్టోరీయే అయినప్పటికీ.. దాన్ని నేటివిటీ మిస్ కాకకుండా ఆసక్తికరంగా తెరపై చూపించాడు ప్రశాంత్ వర్మ..ప్రేక్షకులకు ఏ మాత్రం విసుగు రాకుండా చేయడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్ అనే చెప్పాలి.. రాముడు-హనుమంతుడి ఎలివేషన్ నెక్స్ట్స్ లెవల్ అన్న రేంజ్‌లో తీశాడు.. ప్రశాంత్ వర్మ టేకింగ్ చూసాక.. ఆదిపురుష్ సినిమాను ప్రశాంత్ వర్మకు ఇచ్చి ఉంటే అద్భుతంగా తీసేవాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.దీనిని బట్టి ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెస్మరైజ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.. ఇక.. ఈ మూవీ నార్త్ ఆడియన్స్‌కు ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే.. హిందీ నటీనటులు లేకపోవడంతో ఎంతవరకు రిజల్ట్ ఉంటుందో చెప్పడం కష్టమే.. ఈ మూవీని బాలీవుడ్ ప్రేక్షకులు ఏ మాత్రం ఓన్ చేసుకున్నా.. 300 కోట్ల మార్కును దాటడం ఖాయమంటున్నారు విశ్లేషకులు..
ఓవరాల్ గా విజువల్ ట్రీట్ గా కంప్లీట్ ఫ్యామిలీతో థియేటర్‌కు వెళ్లి చూసే సంక్రాంతి సినిమాగా హనుమాన్ నిలిచింది.