HANUMAN: హనుమాన్ మూవీ టీం బంపర్ ఆఫర్.. ఈ వారం లక్కీ ఛాన్స్

ఈ ఆఫర్ ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది ప్రేక్షకులకు బంపర్ ఆఫరే. వంద రూపాయలకే తెలంగాణలోని అన్ని థియేటర్లలో బాల్కనీలో కూర్చుని సినిమాను ఆస్వాదించవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 08:15 PMLast Updated on: Feb 16, 2024 | 8:15 PM

Hanuman Movie Team Bumper Offer To Audience On Ticket Price

HANUMAN: పాన్ ఇండియా మూవీగా విడుదలైన తెలుగు సూపర్ హీరో ఫిలిం హనుమాన్. విడుదలై నెల రోజులు దాటినా ఈ చిత్రానికి ఇంకా ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇంతగా సక్సెస్ చేసిన ప్రేక్షకుల కోసం చిత్ర యూనిట్ బంపరాఫర్ ప్రకటించింది. నైజాంలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లలో గరిష్ట టిక్కెట్ ధర రూ.175, మల్టీప్లెక్సుల్లో రూ.200, అంతకుమించి ఉంది.

DEVARA: దేవరలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్.. రిలీజ్‌ పోస్టర్‌లో బోలెడు లీక్‌లు..?

అయితే, రాబోయే వారం మాత్రం సింగిల్ స్క్రీన్లలో రూ.100కే ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇక మల్టీప్లెక్సుల్లో రూ.175కే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది ప్రేక్షకులకు బంపర్ ఆఫరే. వంద రూపాయలకే తెలంగాణలోని అన్ని థియేటర్లలో బాల్కనీలో కూర్చుని సినిమాను ఆస్వాదించవచ్చు. ఇప్పటివరకు ఈ చిత్రం చూడని ప్రేక్షకులకు ఈ ఆఫర్ మరింతగా ఉపయోగపడుతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఇండియాతోపాటు విదేశాల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు కొల్లగొడుతోంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి రిలీజైన అన్ని సినిమాలు ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా, హనుమాన్ మాత్రం ఇంకా ఆడుతోంది. ఈ సినిమా వచ్చే నెలలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.