HANUMAN: మాట నిలబెట్టుకున్న హనుమాన్.. అయోధ్యకు ఎంతిచ్చారంటే…
హనుమాన్ టీమ్ మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్టకు విరాళం ఇస్తామని.. హనుమాన్ మూవీ టీమ్ రిలీజ్‌కు ముందు ప్రకటించింది.
HANUMAN: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. బాక్సాఫీస్ దుమ్ము దులుతోంది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమా అవసరమా అని ప్రశ్నించిన నోళ్లే.. ఇప్పుడు హనుమాన్ హవాను పొగుడుతున్నాయ్. వాల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల మార్క్ క్రాసన్ చేసిన హనుమాన్.. వీక్ డేస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. సెకండ్ వీకెండ్‌లోనూ దేశీయ, విదేశాలలో పూర్తిస్థాయి ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది.
AYODHYA RAM MANDIR: రాముడు ఎందుకు మహనీయుడు..? ఈ దేశానికి ఎందుకంత ప్రేమ..?
హనుమాన్ టీమ్ మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్టకు విరాళం ఇస్తామని.. హనుమాన్ మూవీ టీమ్ రిలీజ్‌కు ముందు ప్రకటించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి అయోధ్యకు భారీ విరాళం ఇచ్చింది మూవీ టీమ్. హనుమాన్ మూవీకి వచ్చిన ప్రతి టిక్కెట్ నుంచి 5 రూపాయల చొప్పున.. అయోధ్యలోని రామ మందిరానికి విరాళం ఇచ్చింది. దీంతో అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో చేరింది హనుమాన్ మూవీ టీమ్. హనుమాన్ మూవీకి ఇప్పటివరకు 53 లక్షల 28వేల 211 టిక్కెట్లు అమ్ముడుపోయాయ్. వాటి నుంచి 2 కోట్ల 66 లక్షల 41వేల 55 రూపాయలు అందిస్తున్నట్లు మూవీ నిర్మాతలు ప్రకటించారు. కాగా ఇప్పటికే హనుమాన్ ప్రీమియర్ షోల ద్వారా అమ్మిన 2 లక్షల 97వేల 162 టిక్కెట్ల నుంచి.. 14 లక్షల 85వేల 810 రూపాయల చెక్కును అందించారు. ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
సూపర్ హనుమాన్.. రామయ్యకు హనుమాన్ సాయం అంటూ.. నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఇక అటు హనుమాన్ మూవీకి గంటల్లో వేల టికెట్స్ అమ్ముడు పోతున్నట్లు సమాచారం. హనుమాన్ విడుదలై రెండో వారంలోకి ఎంటర్ అయినా.. ఇంకా ఫుల్ క్రేజ్‌లో టికెట్లు సేల్ అవుతున్నాయ్. ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.