Hari Hara Veera Mallu: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. హరిహర వీరమల్లు టీజర్ అప్పుడే..!
పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్‌లో హరిహర వీరమల్లు ఒకటి. 2022లోనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ రకరకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్‌పోన్ అవుతు వచ్చింది. పైగా ఆ మూవీ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి.

Harihara Veeramallu
Hari Hara Veera Mallu: రాననుకున్నారా.. రాలేననుకున్నారా.. ఇంద్ర మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఈ డైలాగ్‌ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. హరిహర వీరమల్లు రూపంలో సగర్వంగా చెప్పబోతున్నాడు. పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్‌లో హరిహర వీరమల్లు ఒకటి.
Jr NTR: నెక్స్ట్ వార్ ఇక్కడే.. ఈసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘యుద్ధం’ ఇక్కడే
2022లోనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ రకరకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్‌పోన్ అవుతు వచ్చింది. పైగా ఆ మూవీ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి. అయితే, అసలు వీరమల్లు గురించి అప్‌డేట్ కూడా ఎక్కడా రావడం లేదు. మేకర్స్ కూడా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. దీంతో వీరమల్లు ఇప్పట్లో ఉండదనే వార్తలు గత కొంత కాలం నుంచి వినిపిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ అదును చూసి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. వీరమల్లు టీజర్ మే 2న ఉదయం తొమ్మిది గంటలకి విడుదల కాబోతుందని అనౌన్స్ చేశారు. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్‌తో మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ వచ్చింది.
మెగా సూర్యా మూవీస్ పతాకంపై ఏ ఎం రత్నం అత్యంత భారీ వ్యయంతో హరిహర వీరమల్లుని నిర్మిస్తున్నాడు. క్రిష్ దర్శకుడు కావడంతో ప్రాజక్టుపై అందరిలో ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా.. అషు రెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్‌తో పాటు ఎన్నో భారీ చిత్రాలకి మాటల్ని అందించిన సాయి మాధవ్ బుర్రా వీరమల్లుకి కూడా డైలాగ్స్‌ని అందిస్తున్నారు. పవన్ చేస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.