Pawan Kalyan OG : పవన్ ని భయపెడుతున్న “OG”
సో ఇదేదో బానే ఉందికదాని అనుకునేలా లేదు సీన్.. ఎందుకంటే ఓజీ గ్లింప్స తో పవన్ ఫ్యాన్స్ సంబరపడొచ్చు కాని పవన్ తో సినిమాలు తీసే దర్శకులు, వాళ్ల వల్ల పవర్ స్టార్ కి ఇబ్బంది ఎదురౌతోంది.

Hari Hara Veeramallu director Krrish wanted to release a teaser for Pawans birthday but was scared to see glimpses of OG and backed off
పవన్ మూవీని భయపెట్టిన.. పవన్ మరో సినిమా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమానే తన మూవీకే శత్రువుగా మారితే ఎలా ఉంటుంది. అచ్చంగా అదే జరిగేలా ఉంది. పవన్ తో సుజీత్ తీసిన ఓజీ మూవీ మొన్న గ్లింప్స్ రూపంలో షాక్ ఇచ్చింది. అసలు పవన్ సినిమా అంటే ఇలానే కదా ఉండాలి అనేంతగా ఫ్యాన్స్ సంబరపడిపోతుంటే, యాంటీ ఫ్యాన్స్ కూడా జలస్ ఫీలయ్యేలా చేసింది ఓజీ మూవీ గ్లింప్స్.
ఓజీ దెబ్బకి కంగారు పడ్డ టాప్ డైరెక్టర్ క్రిష్..!
సో ఇదేదో బానే ఉందికదాని అనుకునేలా లేదు సీన్.. ఎందుకంటే ఓజీ గ్లింప్స తో పవన్ ఫ్యాన్స్ సంబరపడొచ్చు కాని పవన్ తో సినిమాలు తీసే దర్శకులు, వాళ్ల వల్ల పవర్ స్టార్ కి ఇబ్బంది ఎదురౌతోంది. ముఖ్యంగా హరి హర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ అయితే పవన్ బర్త్ డేకి ఓ టీజర్ వదలాలనుకుని ఓజీ గ్లింప్స్ చూసి భయపడి వెనకడుగు వేశాడట.
దసరాకే రానున్న హరి హర వీరమల్లు కొత్త ప్రోమో ..?
అది పవన్ సినిమానే,హరి హర వీరమల్లు కూడా పవన్ సినిమానే. కాని సుజిత్ తీస్తున్న ఓజీ తాలూకు గ్లింప్స్ ఓరేంజ్ లో ఉంది.. అలాంటి గ్లింప్స్ చూసిన జనం, మరో పవన్ మూవీ హరి హర వీరమల్లు కొత్త ప్రోమోచూస్తే మెచ్చుకోవాలి.. అంటే ఆరేంజ్ క్వాలిటీ షాట్లు పడాలి.. అయితే హరి హర వీరమల్లు కొత్త ప్రోమోని కట్ చేసి రిలీజ్ కి రెడీ చేసిన క్రిష్ మాత్రం ఓజీ గ్లింప్స్ కి ఫిదా అయ్యి, ఆరేంజ్ లో హరి హర వీరమల్లు కొత్త ప్రోమో లేదని, తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ తో కొత్త ప్రోమోని దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాడట. ఇలా ఓజీ గ్లింప్స్ హరి హర వీరమల్లు టీం ని కంగారు పెట్టింది. ఈ మూవీ ప్రోమో కోసం పవన్ కూడా షూట్ లో జాయిన్ అయితే కాని కొత్త ప్రోమో రాకపోవచ్చే మాటే వినిపిస్తోంది.