Hari hara veeramallu : ‘హరి హర వీరమల్లు’ వచ్చేస్తున్నాడయ్యా..
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. నిజానికి.. రెండేళ్లుగా ఈ సినిమా మేకింగ్ దశలోనే ఉంది. మరో వైపు ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ క్రిష్ (Director Krrish) తప్పుకున్నారంటూ రూమర్స్ కూడా వచ్చాయి.

'Hari Hara Veeramallu' is coming..
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. నిజానికి.. రెండేళ్లుగా ఈ సినిమా మేకింగ్ దశలోనే ఉంది. మరో వైపు ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ క్రిష్ (Director Krrish) తప్పుకున్నారంటూ రూమర్స్ కూడా వచ్చాయి. పైగా సినిమా నుంచి ఇటీవల ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. ఇలాంటి వేళ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. త్వరలో ఈ మూవీ నుండి ఒక స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ ఒక్క ప్రకటనతో పవర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేయడం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. దెబ్బకి హరిహర వీరమల్లు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అదిరిపోయే ప్రోమో కోసం ఎదురుచూస్తున్నట్లుగా పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. హరిహర వీరమల్లు వచ్చేస్తున్నాడంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
పాన్ ఇండియా (Pan India) మూవీగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్ ఓ వీరుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎంఎం కీరవాణి (MM Keeravani) ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడు. హాలీవుడ్‌కు చెందిన వీఎఫ్ఎక్స్, యానిమేషన్ ప్రొడ్యూసర్ బెన్ లాక్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు కూడా వర్క్ చేస్తున్నారు.. 2021లో ఈ సినిమాకు రూ.150 కోట్లు బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రూ.200 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. మరి ఇంత భారీగా హైప్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి మరి..