Harihara Veeramallu : ‘ధర్మం కోసం యుద్ధం’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి హరిహర వీరమల్లు పవన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. పైగా పవన్ నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

Harihara Veeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటి హరిహర వీరమల్లు పవన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. పైగా పవన్ నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. గత కొన్ని రోజులనుంచి వీరమల్లు కి సంబంధించిన అప్ డేట్ ఏది రావడం లేదని ఫ్యాన్స్ నిరుత్సాహం లో ఉన్నారు. వాళ్ళందరి బాధని అర్ధం చేసుకున్నమేకర్స్ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్ డేట్ ని ఇచ్చింది. కేవలం పవన్ కళ్ళని మాత్రమే చూపిస్తు మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో.. అనే ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.ఇప్పుడు ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది. సోషల్ మీడియాలోను రికార్డ్స్ సృష్టిస్తుంది.
నిజానికి వీరమల్లు షూటింగ్ 2022 లోనే స్టార్ట్ అయ్యింది.అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తు వస్తున్నారు. కానీ ఏదో ఒక కారణంతో షూటింగ్ వాయిదా పడుతు వస్తుంది. నిజం చెప్పుకోవాలంటే పవన్ నుంచి వచ్చిన గత మూవీ బ్రో కంటే ముందే వీరమల్లు ప్రారంభయ్యింది. అసలు ఒక సందర్భంలో మూవీ ఇప్పట్లో రాదనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు బయటకు వచ్చిన పోస్టర్ తో రికార్డులు సృష్టించడానికి వీరమల్లు ముస్తాబు అవుతున్నట్టుగా అందరకి అర్ధం అయ్యింది. చూస్తుంటే అతి త్వరలోనే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా రిలీజ్ అయిన ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ కత్తిని చూపిస్తూ.. వేటకు వెళ్లేటప్పుడు సింహం కళ్లు ఎలా ఉంటాయో అలా పవన్ రెండు కళ్లు ఉన్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మరింది. ఈ ట్రీట్‌తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుండగా క్రిష్ దర్శకత్వాన్నివహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక ముఖ్య పాత్రని పోషిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. పవన్ అండ్ రత్నం కాంబోలో గతంలో ఖుషి, బంగారం లాంటి సినిమాలు వచ్చాయి.