Harihara Veeramallu : వీరమల్లు పవరేంటో చూపించాడు…
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఫుల్ స్టాప్ పడింది.. పండగ చేసుకునే టైమ్ వచ్చేసింది.. ఎట్టకేలకు హరిహర వీరమల్లు (Harihara Veeramallu) మూవీ టీజర్ వచ్చేసింది.

Harihara Veeramallu
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఫుల్ స్టాప్ పడింది.. పండగ చేసుకునే టైమ్ వచ్చేసింది.. ఎట్టకేలకు హరిహర వీరమల్లు (Harihara Veeramallu) మూవీ టీజర్ వచ్చేసింది. గతంలో ఎప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఇన్నాళ్లకు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఆకలి తీరుస్తూ.. పవర్ ఫుల్ లుక్‌తో టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.. మొఘల్స్ కాలంలో రాజులు, నవాబులు అందరూ ప్రజలపై దాడి చేస్తూ వారి శ్రమను దోచుకుంటుంటే.. వాళ్లను దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడు అంటూ టీజర్ లో చెప్పుకొచ్చారు.
ఇక ఈ టీజర్ చూస్తే చాలా కాలం తర్వాత పవన్ నుంచి ఫుల్ పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ పక్కా అన్నది అర్థమవుతోంది.. చురకత్తుల్లాంటి చూపులతో పక్కా పవర్ లుక్‌తో ఉన్న పవన్ పోస్టర్ (Pawan Poster) చూసి గూస్ బంప్స్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్.. టీజర్ లో మొఘల్స్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటుంటే వాళ్ళని దోచుకోడానికి ఓ దొంగ వస్తాడు, 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా కథాంశం ఉండనున్నట్టు చూపించారు. టీజర్ అయితే అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా మరింత హైప్ పెరిగింది. ఇక ఈ సినిమా 2024 లోనే రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.. ఈ సినిమా కూడా రెండు పార్టులుగా రానున్నట్టు తెలుస్తుంది. టీజర్ రిలీజ్ కి హరిహర వీరమల్లు పార్ట్ 1 అని రిలీజ్ చేశారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. ఈ టీజర్ చూసి ఫ్యాన్స్.. ఈ సిమాతో వపర్ స్టార్ తన అసలైన పవర్ ఏంటో చూపిస్తాడనీ.. అందరి లెక్కలు సరిచేస్తాడనీ కామెంట్స్ పెడుతున్నారు.