Pawan Kalyan: ఆ బ్రో మీదే పగపట్టారు.. అందుకే దూరంగా వాళ్లంతా..
బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ మాటలు ఫ్యాన్స్ ని పిదా చేశాయి. కాని ఎందుకనో ఈ ఈవెంట్ లో ముగ్గురు దర్శకులు కనిపించకపోవటం మీద రకరకాల గుసగుసలు పెరిగాయి. పవన్ తో హరి హర వీరమల్లు తీస్తున్న క్రిష్, ఉస్తాధ్ భగత్ సింగ్ తీస్తున్న హరీష్ శంకర్, అలానే ఓజీ డైరెక్టర్ సుజీత్ ఎవరూ కూడ బ్రో ఈవెంట్లో కనిపించలేదు.

Harish Shankar and Krish did not attend the pre-release event of Pawan Kalyan and Sai Dharam Tej because of their anger towards Trivikram
ఏ హీరోతోనైనా సినిమాలు తీస్తున్న దర్శకులు, ఆ హీరో తాలూకు మూవీ ఈవెంట్లో సందడి చేయటం కామన్. కాని ఎందుకనో హరీష్ శంకర్, క్రిష్ కనిపించలేదు. సుజీత్ అంటే ఓజీ లో పవన్ లేని సీన్లు తీస్తున్నాడు కాబట్టి బిజీ అనుకోవచ్చు. కాని ఈ ఇద్దరు ఎందుకు లేరు. కారణం త్రివిక్రమ్ మీదున్న పగే అంటున్నారు.
పవన్ తో త్రివిక్రమ్ తనకున్న చనువుని వాడుకుని తనవాళ్లకు సంబంధించిన సినిమాలు వేగంగా పూర్తయ్యేలా చేస్తున్నాడు. భీమ్లానాయక్, బ్రో అలానే వేగంగా తెరకెక్కాయి. ఓజీ కూడా తన టీం మెంబరే తెరకెక్కిస్తున్నాడు. ఆ ప్రాజెక్టుల్లో త్రివిక్రమ్ కి వాటా ఉంది కాబట్టే వాటిని వేగంగా పూర్తి చేసేలా పవన్ కాల్ షీట్లు ఇచ్చేలా మతలబు చేస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ.
ఇక హరి హర వీరమల్లు ఇన్ని సార్లు ఆగింది. ఉస్థాద్ భగత్ సింగ్ మళ్లీ పట్టాలెప్పుడు ఎక్కుతుందో తెలీదు.. అందుకే పవన్ మీద వీళ్లు అలిగారు. త్రివిక్రమ్ మీద పగతో రగిపోతున్నారు.. కాబట్టే బ్రో ఈవెంట్ లో వాళ్లు లేరనే వాదనుంది.