HARISH SHANKAR: మీరు ఒకటి అంటే.. నేను వంద అంటా.. మీడియాతో ఫైట్‌కి హరీశ్ శంకర్ రెడీ
సినిమా ఇండస్ట్రీ అంటే అందులో జర్నలిస్టులు కూడా ఒక భాగమని తాను నమ్ముతానన్నాడు హరీష్. మనం ఒకరి మీద ఒకరం రాళ్లేసుకోవడం మంచిది కాదని హితవు పలికాడు. ఈగల్ గురించి నెగిటివ్‌గా రాసిన వెబ్‌సైటే తనపై చేసిన ఆరోపణలు గుర్తుచేశాడు హరీశ్.
HARISH SHANKAR: ఈగల్ సక్సెస్‌మీట్ హరీష్ వర్సెస్ వెబ్‌సైట్‌గా మారిపోయింది. రవితేజ, కావ్య థాపర్ జంటగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రిలీజైన ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఓ వెబ్‌సైబ్ ఇచ్చిన రివ్యూపై విమర్శలు గుప్పించారు హరీష్. ఆ వెబ్‌సైట్ చేసిన తప్పునే హరీశ్ కూడా చేస్తున్నట్టు అర్థమవుతోంది. రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు లాంటి వరస ఫ్లాపుల తర్వాత రవితేజ నటించిన ఈగల్ మంచి వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లో రూ.13 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సినిమా ఇంకో 8 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
EAGLE RATINGS: ఈగల్ రేటింగ్‌తో దెబ్బకొట్టిన ఆ వర్గం.. పవన్ కళ్యాణ్ కారణమా..?
ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సక్సెస్‌మీట్ ఏర్పాటు చేశారు నిర్మాత విశ్వప్రసాద్. ఈగల్ నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌లో హరీశ్.. రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ తీస్తున్నాడు. అందుకే ముఖ్య అతిథిగా విచ్చేశాడు. హరీశ్ మాట్లాడుతూ విమర్శించే ముందు దర్శకుడు ఎలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు.. అతని జర్నీ ఏంటో చూడకుండా.. నెగిటివ్ రివ్యూస్ రాయడం సరికాదన్నాడు. సినిమా ఇండస్ట్రీ అంటే అందులో జర్నలిస్టులు కూడా ఒక భాగమని తాను నమ్ముతానన్నాడు హరీష్. మనం ఒకరి మీద ఒకరం రాళ్లేసుకోవడం మంచిది కాదని హితవు పలికాడు. ఈగల్ గురించి నెగిటివ్‌గా రాసిన వెబ్‌సైటే తనపై చేసిన ఆరోపణలు గుర్తుచేశాడు హరీశ్. తాను నాలుగేళ్లుగా ఖాళీగా వున్నానని.. నిర్మాత ఆఫీసులోకి కూర్చుని తెల్లార్లూ తాగుతున్నానని రాసిందని.. తన ఫొటో పెట్టే ధైర్యం కూడా లేదని సదరు వెబ్‌సైట్‌పై మండిపడ్డాడు హరీష్. తనపై రాస్తూ.. తన ఫొటో పెట్టే ధైర్యం కూడా ఆ వెబ్‌సైట్‌కు లేదని దుయ్యబట్టాడు హరీష్.
Rashmi Gautam: మంచి ఛాన్స్ మిస్.. కుర్చీని మడతపెట్టి సాంగ్ రిజెక్ట్ చేసిన రష్మీ..
అయితే.. ఇలా రాసిన వెబ్‌సైట్ ఏంటో చెప్పే ధైర్యం హరీశ్ చేయలేదంటున్నారు నెటిజన్లు. ఇలా తప్పుగా రాసిన వెబ్‌సైట్ పేరేంటో చెబితే బాగుండేదంటున్నారు. ట్రోలింగ్ తనకు కొత్తకాదని.. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడే ముందుగా తల్లిదండ్రులతో ట్రోలింగ్ మొదలైందన్నాడు హరీష్. ట్రోలింగ్‌కు, విమర్శకు మధ్య చాలా తేడా ఉందనీ.. విమర్శించడంలో తప్పేంలేదని.. వ్యక్తిగత దాడి సరికాదన్నాడు. జర్నలిస్టులు, సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటే అనుకుంటున్నాననీ.. కాదని తన నెక్ట్స్ మూవీని టార్గెట్ చేసినా పీకలేరంటూ సింబాలిక్‌గా చెప్పాడు. హరీశ్ శంకర్ నాలుగేళ్లు ఖాళీగా వున్నాడని వస్తున్న వెబ్‌సైట్ విమర్శను.. నాలుగు సినిమాలతో తిప్పి కొట్టాడు. హరీశ్ వర్సెస్ వెబ్‌సైట్ ఇష్యూలో నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ప్రకటించాడు దర్శకుడు. గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హరీశ్, పవన్ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రూపొందుతోంది. పవన్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో ఈలోగా రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ మొదలుపెట్టాడు.
దీని తర్వాత నెక్ట్స్ మూవీ ప్రకటించకపోయినా ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలను త్వరలో ఎనౌన్స్ చేస్తామన్నాడు హరీశ్. హరీశ్ ఇంతవరకు బాలకృష్ణ, చిరంజీవితో సినిమాలు తీయలేదు. ఆచార్య టీంను హరీశ్ ఇంటర్వ్యూ చేయగా.. కథ రెడీ చేస్తే చిరంజీవి చేద్దామన్నాడు. లేటెస్ట్‌గా హరీశ్ బాలయ్యతో సినిమా చేస్తున్నాడన్నవార్త హల్‌చల్ చేసింది. ఈ లెక్కన హరీశ్ త్వరలో డైరెక్ట్ చేయబోయే పెద్ద హీరోలు చిరంజీవి, బాలయ్యేనా? కాదో త్వరలో తెలియనుంది.