Harish Shankar: పవన్ కళ్యాణ్ కి నచ్చిన దర్శకుడి దగ్గర హరీష్ శంకర్ శిష్యరికం..
పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ గతంలో గబ్బర్ సింగ్ మూవీ తీశాడు. ఇప్పుడు పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తీసేందుకు అష్టకస్టాలు పడుతున్నాడు. మొన్నటి వరకు పవన్ డేట్లు సరిగా ఇవ్వక, త్రివిక్రమ్ ఇన్ ఫ్లూయెన్స్ తో సుజీత్ కే డేట్లు ఎక్కువ ఇచ్చాడన్నారు. కట్ చేస్తే అదేం కారణం కాదని తెలుస్తోంది.

Harish Shankar counters that director Sujith, who is shooting for Og movie with Pawan Kalyan, learn how to make a film
సుజీత్ ఎంచక్కా పవన్ తో సినిమా అనగానే బిహైండ్ ద సీన్స్ అంటూ, తన విజువల్స్ తో ఓజీ మూవీ ప్రోమో వదిలాడు. తర్వాత మేకింగ్, అంతకుముందు ఓజీ పోస్టర్.. ఇలా ప్రతీ నెలలో కనీసం రెండు వారాలు ఓజీ అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. పవన్ లేని సీన్లు పూర్తి చేసి 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసి పవన్ ని ఆశ్చర్య పరుస్తున్నాడు..
ఈ విషయంలో 3 రోజుల షూటింగ్ తో గ్లింప్స్ రెడీచేయటం తప్ప మరేం చేయలేకపోతున్న హరీష్ శంకర్ మీద సెటైర్లు పేలుతున్నాయి. కథ రాసేది తను కాదు దశరత్, మరి ఇలా ఎవరెవరో పనులు పంచుకున్నా ఉస్తాద్ భగత్ సింగ్ అప్ డేట్స్ ఇవ్వటంతో హరీష్ శంకర్ ఫేల్ అవుతున్నాడు. అందుకే అటు పవన్, ఇటు తన ఫ్యాన్స్ ఇద్దరూ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ మీద కామెంట్లు పెంచారు. ఓజీ డైరెక్టర్ సుజీత్ దగ్గర శిష్యరికం తీసుకోమంటున్నారు.