రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్న హరీష్ శంకర్…?
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా సరే దర్శకుడు నిలబెట్టుకోలేదు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా సరే దర్శకుడు నిలబెట్టుకోలేదు. హిట్ సినిమాను రీమేక్ చేసినా సరే మిస్టర్ బచ్చన్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కేవలం మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని నాలుగు మాస్ డైలాగ్స్ తో సినిమాను హిట్ చేసుకోవాలని భావించినట్టుగానే కనపడింది. దానికి తోడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే నెల షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
ఆ షూటింగ్ విషయంలో దృష్టి పెట్టి మిస్టర్ బచ్చన్ సినిమాను హడావుడిగా చేసాడు హరీష్ శంకర్. ఇక రవితేజా కూడా కథ విషయంలో ముందు వెనుకా చూడకుండా సినిమా చేయడంపై ఫ్యాన్స్ కూడా తిట్టే పరిస్థితి వచ్చింది. కేవలం డబ్బుల కోసమే రవితేజా సినిమాలు చేస్తున్నాడు అనే ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంచితే ఈ సినిమా విషయంలో హరీష్ శంకర్ ఒక నిర్ణయం తీసుకున్నాడట. తాను తీసుకున్న రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేయాలని ఆయన నిర్ణయం తీసుకుని నిర్మాతకు మేలు చేయాలని భావిస్తున్నాడట.
ఈ సినిమా కోసం దాదాపుగా హరీష్ శంకర్ 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. కాని ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేసేందుకు సిద్దంగా ఉన్నాడట. ఈ సినిమా వసూళ్లు ఇప్పటి వరకు కేవలం 13 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీనితో ఈ నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అటు రవితేజా మాత్రం రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడానికి సిద్దంగా లేరు అని టాక్. ఏది ఎలా ఉన్నా మిస్టర్ బచ్చన్ మాత్రం విమర్శలకు వేదిక అయింది. ఒక పాటలో స్టెప్ కూడా వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ పై పెట్టిన శ్రద్దలో సగం సినిమా కథపై పెట్టినా సరే కచ్చితంగా హిట్ అయ్యేది అనే కామెంట్స్ కూడా వినిపించాయి.