HARISH SHANKAR: చిరు, బాలయ్య నుంచి ఆఫర్.. ముందు నుయ్యి వెనక గొయ్యిలా హరీష్ శంకర్ పరిస్థితి..?
పవన్ కళ్యాణ్ కావాలని బ్రేక్ వేయకున్నా హరీష్ శంకర్‌కి కష్టాలు తప్పట్లేదు. ఉస్తాద్ భగత్ సింగ్‌ని ఏక్షణాన హరీష్ శంకర్ ప్లాన్ చేశాడో కానీ, తనకి మాత్రం కస్టాలు తప్పట్లేదు. ముందు భవదీయుడు భగత్ సింగ్ ప్లాన్ చేస్తే, ఆ కథ వద్దని తేరీ రీమేక్ ప్లాన్ చేశారు.
HARISH SHANKAR: పవర్ స్టార్ పవర్ ఫుల్ బ్రేక్ వేస్తే ఎలాంటి డైరెక్టర్‌కైనా కష్టాలు తప్పవు. అయితే పవన్ కళ్యాణ్ కావాలని బ్రేక్ వేయకున్నా హరీష్ శంకర్‌కి కష్టాలు తప్పట్లేదు. ఉస్తాద్ భగత్ సింగ్‌ని ఏక్షణాన హరీష్ శంకర్ ప్లాన్ చేశాడో కానీ, తనకి మాత్రం కస్టాలు తప్పట్లేదు. ముందు భవదీయుడు భగత్ సింగ్ ప్లాన్ చేస్తే, ఆ కథ వద్దని తేరీ రీమేక్ ప్లాన్ చేశారు. దీంతో టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్‌గా మారింది.
PAWAN KALYAN: పొత్తులపై తొందరపాటు మాటలొద్దు.. జనసైనికులకు పవన్ సూచన
కానీ సీన్లోకి సుజీత్ మూవీ ఓజీ వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వెనక్కి వెల్లింది. తర్వాత ఏపీ ఎలక్షన్స్‌తో పవన్ బిజీ అవటంతో, ఓజీతో పాటు, ఉస్తాద్ భగత్ సింగ్ పెండింగ్ షూటింగ్ కూడా ఆగింది. ఈలోపు వేగంగా 4 నెలల్లో రవితేజతో మిస్టర్ బచ్చన్ తీయటం మొదలుపెట్టాడు హరీశ్ శంకర్. పవన్ కాల్ షీట్స్ ఇచ్చేలోపు ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు హరీష్ వేగం పెంచినా, విచిత్రంగా తనకి చిరు, బాలయ్య రెండు సినిమాల ఆఫర్స్ వచ్చాయట. చిరు కూతురి ప్రొడక్షన్‌లో హరీష్ శంకర్ ఓ సినిమా తీసేలా ఆఫర్ వచ్చింది. నటసింహం బాలయ్యతో గీతా ఆర్ట్స్ ప్లాన్ చేసిన ఓ ప్రాజెక్ట్ కూడా హరీష్ శంకర్ చేతికే వచ్చి చిక్కినట్టుంది. ఈ రెండు బంపర్ ఆఫర్స్‌కి సైన్ చేయాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయ్యేకే ఛాన్స్ ఉంటుంది.
సరే.. చిరు విశ్వంభర, బాలయ్య 109 మూవీతో ఈలోపు బిజీ అవుతారనుకుంటే కూడా కష్టం తప్పట్లేదు. ఎందుకంటే ఓజీ, హరి హర వీరమల్లు పూర్తయ్యాకే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తానంటే, చిరు, బాలయ్య ప్రాజెక్టులు హరీష్ శంకర్ వదులుకోవాల్సి వస్తుందట.