Pawan Kalyan: పవర్ స్టార్ నిర్ణయంతో డైలమాలో హరీష్ శంకర్
మొన్నే 60 రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎలాగైనా జనవరిలోగా ఉస్తాద్ భగత్ సింగ్‌ని పూర్తి చేయాలని సూచన కూడా ఇచ్చాడు. అలానే షూటింగ్ షెడ్యూల్స్‌ని ప్లాన్ చేసుకోవాలన్నాడని కూడా వార్తలు వచ్చాయి. కాని మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ కథ మొదటికే వచ్చిందట.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎండ్ లేని పజిల్‌లా మారింది. తనతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్లాన్ చేసిన హరీష్ శంకర్‌కి మళ్లీ చుక్కెదురౌతోంది. మొన్నే 60 రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎలాగైనా జనవరిలోగా ఉస్తాద్ భగత్ సింగ్‌ని పూర్తి చేయాలని సూచన కూడా ఇచ్చాడు. అలానే షూటింగ్ షెడ్యూల్స్‌ని ప్లాన్ చేసుకోవాలన్నాడని కూడా వార్తలు వచ్చాయి. కాని మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ కథ మొదటికే వచ్చిందట. ఏపీలో పొలిటికల్‌గా పవన్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుండటం, మీటింగ్స్‌తో ఊపు పెరగటంతో లెక్కలు మారుతున్నాయి.
ఏపీలో పొలిటికల్ జర్నీ బెటర్ అవుతున్న కొద్దీ పవన్ సినిమాలకు పంచ్ పడే పరిస్థితులు పెరిగాయి. కారణం పొలిటికల్ మైలేజ్ బాగుంటే, ఫోకస్ అంతా అటు షిఫ్ట్ చేయాల్సి రావడం. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎన్నికల ముందు ఒక మాస్ మూవీ పడాలని, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కి ప్లాన్ చేయమన్నాడు పవన్. కాని సినిమా రాకున్నా, ఏపీలో పరిస్థితులు పవన్‌కి అనుకూలంగా మారుతుండటం, తన పొలిటికల్ స్పీచ్‌లతో అక్కడ ఈక్వేషన్స్ మారుతుండటంతో, తన సినిమాలకు తన పాలిటిక్సే శాపంలా మారుతున్నట్టు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ టీం షెడ్యూల్ రెడీ చేసినా సెప్టెంబర్‌లో షూటింగ్ షురూ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు.