Pawan Kalyan: పవర్ స్టార్ సినిమా విషయంలో తట్టుకోలేనంత ఫ్రస్ట్రేషన్‌లో డైరెక్టర్..?
పవన్ కళ్యాణ్ మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పక్కన పెట్టి మరీ ఏపీకి వెళ్లిపోయాడు. దీంతో హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కి బ్రేక్ పడుతుందన్నారు. కాని పవన్ లేకుండానే తను లేని సీన్లను షూట్ చేస్తున్నాడు హరీష్ శంకర్.

Pawan Kalyan: ఏపీలో పొలిటికల్ హీట్ పెరగటంతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పక్కన పెట్టి మరీ ఏపీకి వెళ్లిపోయాడు. దీంతో హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కి బ్రేక్ పడుతుందన్నారు. కాని పవన్ లేకుండానే తను లేని సీన్లను షూట్ చేస్తున్నాడు హరీష్ శంకర్. కాకపోతే పవన్ లేని సీన్లు షూట్ చేసినా, డూప్‌ని పెట్టుకుని తీసినా, 10 శాతం మించి సీన్లు తీయలేదు. అసలే అతి కష్టం మీద 14 రోజులు పవన్ కాల్ షీట్స్ దొరికాయి.
అందులో 7 రోజులు ఫైట్ సీన్లకు, మిగతా 7 సీన్లలో హీరోయిన్‌తో ఉన్న కాంబినేషన్ సీన్లు. ఈరెండు ఇప్పుడు పెండింగ్‌లో పడ్డాయి. ఇలాంటి అనుభవం గతంలో క్రిష్‌కి కలిగింది కాబట్టే హరి హర వీరమల్లులో పవన్ లేని సీన్లే కాదు, పవన్ ఫైట్ సీన్లను కూడా డూప్‌ని పెట్టి తీశాడు. అలా చేస్తేనే 70 శాతం షూటింగ్ పూర్తైంది. ఇదే పద్దతిని ఓజీ విషయంలో సుజీత్ ఫాలో అయ్యాడు. కాబట్టే తను కూడా 60శాతం వరకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ మూవీ పూర్తి చేయగలిగాడు. ఇప్పుడు ఇలానే హరీష్ శంకర్ కూడా పవన్ లేకుండా ఉండే సీన్లు, ఇక పవన్ ఉండే సీన్లలో డూప్ పెట్టి షూటింగ్ చేయాల్సి వచ్చేలా ఉంది.
కాని డూప్ అనేది కేవలం ఫైట్ సీన్లకు మాత్రమే సూట్ అవుతుంది. టాకీ పార్ట్ తీయాలంటే పవన్ ఉండి తీరాల్సిందే. 80 శాతం పంచ్ డైలాగ్స్‌ని టాకీ పార్ట్‌నే నమ్ముకుని సినిమా తీసే హరీష్ శంకర్‌కి మాత్రం ఏం చేయాలో తోచట్లేదు. ఏపిలో ఏ పొలిటికల్ రగడ జరిగినా, దానికి పవన్ రియాక్ట్ అవటం, ఫలితంగా తన సినిమా షూటింగ్ ఆగిపోవటం ఇదే కామన్ అవుతోంది.