Pawan Kalyan: షూటింగ్ సెట్లో అలిగిన డైరెక్టర్ హరీష్ శంకర్..
మొన్న పవన్ బర్త్ డే కి వచ్చిన ఓజీ గ్లింప్స్ ఓరేంజ్ లో ఫ్యాన్స్ నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు పూనకాలు తెచ్చింది. ఆ ఎఫెక్ట్ వల్లే పవన్ మనసు మారిందేమో కాని, ఎట్టి పరిస్తితుల్లో క్రిస్మస్‌కి ఓజీ విడుదల అవ్వాల్సిందే అంటున్నాడట.

Pawan Kalyan: హరీష్ శంకర్ మళ్లీ పవన్ కళ్యాణ్ మీద అలిగినట్టున్నాడు. ఒక వైపు మనల్ని ఆపేదెవరంటూ పోస్టులు పెట్టి, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగుతో బిజీఅవుతూనే, మరో వైపు ఈ మూవీ రిలీజ్ విషయంలో కాస్త నిరుత్సాహపడుతున్నాడట. నిజానికి ఏపీ ఎలక్షన్స్‌కి ముందు ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి మాస్ మూవీ రిలీజ్ అయితే, మంచి మైలేజ్ దొరుకుతుందనే, ఈ సినిమాకు నెలకు 20 రోజులు చొప్పున డేట్లిచ్చాడు పవన్.
దీంతో మంచి జోష్ మీద ఈ వీక్ నుంచే రంగంలోకి దిగాడు హరీష్ శంకర్. కాకపోతే మొన్న పవన్ బర్త్ డే కి వచ్చిన ఓజీ గ్లింప్స్ ఓరేంజ్ లో ఫ్యాన్స్ నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు పూనకాలు తెచ్చింది. ఆ ఎఫెక్ట్ వల్లే పవన్ మనసు మారిందేమో కాని, ఎట్టి పరిస్తితుల్లో క్రిస్మస్‌కి ఓజీ విడుదల అవ్వాల్సిందే అంటున్నాడట. మిస్ అయితే సంక్రాంతి.. సో ఓజీ తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందని కన్ఫామ్ అయ్యింది. హరీష్ శంకర్ కూడా ఓ వైపు ఈ సినిమా షూటింగ్ తో బిజీ అవుతూనే, తన డిసప్పాయింట్ మెంట్ ని టీం దగ్గర వెలిబుచ్చటంతో, మొత్తానికి పవన్ మూడు మూవీల్లో ఏది ముందు రాబోతోందో తేలిపోయింది.
ఓజీ క్రిస్మస్ లేదంటే సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉండగా, ఇక మార్చి లేదా ఏప్రిల్ రెండో వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలవ్వొచ్చు. అంటే ఎలక్షన్స్ కి ముందు ఒకటి, ఎన్నికల తర్వాత మరొకటి రావటం ఫిక్స్అయ్యాయి. ఇక హరి హర వీరమల్లు షూటింగ్ కి పవన్ ఇప్పట్లో డేట్లిచ్చే పరిస్తితి లేదు. కాబట్టి, హరిహర వీరమల్లు వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లోనే అంటున్నారు. మోస్ట్ లీ వచ్చే ఏడాది దసరాకే హరి హర వీరమల్లు రావొచ్చట.