HARISH SHANKAR: డైరెక్టర్ హరీష్‌ మరో వివాదం.. ఈసారి ఇండస్ట్రీ పెద్దనే గెలికాడుగా..

మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు డైరెక్టర్ హరీష్‌. కెమెరామెన్‌ చోటా కే నాయుడుకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ.. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చోటా.. హరీష్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2024 | 07:32 PMLast Updated on: Apr 20, 2024 | 7:32 PM

Harish Shankar Responded On Cameraman Chota K Naidu Comments On Him

HARISH SHANKAR: డైరెక్టర్ హరీష్‌ శంకర్.. సినిమాలతో కంటే వివాదాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు ఈ మధ్య! ఆ మధ్య మీడియావాళ్లను కెలికారు.. ఆ తర్వాత పవన్‌ను టార్గెట్ చేసిన వాళ్లను ఆడుకున్నారు. ఆ వివాదాలు ఇంకా కంటిన్యూ అవుతుండగానే.. మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు డైరెక్టర్ హరీష్‌. కెమెరామెన్‌ చోటా కే నాయుడుకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ.. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Vikramarkudu-2: త్వరలో విక్రమార్కుడు 2.. హీరోగా రవితేజ..?

ఈ మధ్య ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చోటా.. హరీష్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి రెస్పాన్స్‌గానే.. ఇప్పుడు హరీష్‌ లెటర్ రిలీజ్ చేశాడు. “గౌరవనీయులైన చోటా గారికి నమస్కరిస్తూ అంటూ లేఖ స్టార్ట్ చేసిన హరీష్‌.. రామయ్యా.. వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటిందని.. ఈ పదేళ్లలో మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే, తాను 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటానని రాసుకొచ్చాడు. ఎప్పుడూ ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదని.. మీరు మాత్రం పలుమార్లు తన గురుంచి అవమానకరంగా మాట్లాడారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మీకు గుర్తుందో లేదో.. ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్‌తో షూటింగ్‌ చేద్దామన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజు గారు చెప్పడం మూలంగానో, గబ్బర్ సింగ్‌ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ని తీసేస్తున్నాడని.. పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మధనపడుతూనే.. మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా.. ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు నాది.. రామయ్యా.. వస్తావయ్యా వస్తే అది నీది.. అనే క్యారెక్టర్ కాదు నాది.

మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా.. నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు.. నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సివస్తోంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా.. మీకున్న అనుభవంతో మీనుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు.. కూడదు.. మళ్లీ కెలుక్కుంటాను అని అంటే ఎనీ డే, ఎనీ ఫ్లాట్‌ఫామ్‌, ఐయామ్ వెయిటింగ్.. భవదీయుడు హరీశ్‌ శంకర్‌” అని లేఖ పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఐతే తమలో తాము సరిదిద్దుకోవాల్సిన విషయాలపై.. ఇలా సోషల్‌ మీడియా ఎక్కి.. వాదించుకోవడం.. సవాళ్లు విసురుకోవడం ఏంటి.. కొత్త కాంట్రవర్సీకి తెరలేపడం ఏంటి అని ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. తప్పు ఎవరిదైనా.. వాళ్లలో వాళ్లు సాల్వ్‌ చేసుకుంటే బాగుండేదని సూచిస్తున్నారు.