Samantha Ruth Prabhu: ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. చివరి జ్ఞాపకాన్ని చెరిపేసిన సమంత..
విడిపోదామనుకోవడం ఆలస్యం.. ఇన్‌స్టాలో పేరు పక్కన ఇంటిపేరు అక్కినేనిని తీసేసింది. ఆ తర్వాత చైతుతో అన్ని రకాల ఫొటోలను డిలీట్ చేసేసింది. కానీ.. ఓ టాటూ మాత్రం సామ్‌ను వెంటాడడంతో.. అది కూడా తాజాగా తొలగించుకుంది.
Samantha Ruth Prabhu: పచ్చబొట్టూ చెరిగీ పోదులే.. అన్న పాట తప్పని సమంత ఫ్రూవ్ చేసింది. చైతుతో జ్ఞాపకాల నుంచి బైటకు రావడం కష్టమే అయినా.. తప్పడం లేదు. ఒంటి మీద ఓ టాటూను చూస్తుంటే.. చైతు గుర్తుకొస్తుండొచ్చు. అందుకే చైతూ గుర్తుగా ఉన్న ఆ జ్ఞాపకాన్ని కూడా చెరిపేసింది సామ్. నాగచైతన్య, సమంత విడిపోతున్నామని ప్రకటించి రెండేళ్లవుతోంది. ఆల్రెడీ డివోర్స్ కూడా వచ్చేశాయి. కానీ.. సామ్ మాత్రం చైతు మెమరీస్ నుంచి దూరం కావడానికి చాలా కష్టపడుతోంది.
విడిపోదామనుకోవడం ఆలస్యం.. ఇన్‌స్టాలో పేరు పక్కన ఇంటిపేరు అక్కినేనిని తీసేసింది. ఆ తర్వాత చైతుతో అన్ని రకాల ఫొటోలను డిలీట్ చేసేసింది. కానీ.. ఓ టాటూ మాత్రం సామ్‌ను వెంటాడడంతో.. అది కూడా తాజాగా తొలగించుకుంది. సమంత ఒంటిపై మూడు రకాల టాటూలు కనిపించేవి. ‘ఏమాయ చేసావె’ గుర్తుగా YMC టాటూ వుంటుంది. మరోటి మణికట్టు మీద బాణం ఆకారంలో ఒకటి కనిపించేది. పక్కటెముల మీద చైతు పేరుతో ఇంకో టాటూ వుండేది. రీసెంట్‌గా దుబాయ్ వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చిన క్రమంలో రిబ్స్ మీద చైతు టాటూ కనిపించలేదు. ప్రేమించుకున్నారు.. విడిపోయారు. ఆ ప్రేమే లేనప్పుడు ఇక టాటూ ఎందుకనుకుందో ఏమో.. టాటూగా వేయించుకున్న చై పేరు కనిపించలేదు. దీంతో సామ్ టాటూ చెరిపేసుకుందని అందరూ అనుకుంటున్నారు.
మయోసైటిస్ ట్రీట్‌మెంట్ కోసం ఏడాదిపాటు సినిమాలకు దూరంగా వుండాలనుకుంది సామ్. ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లి అక్కడే రెండు, మూడు నెలలు వుంటుందనుకుంటే.. నెల తిరగకుండా తిరిగొచ్చేసింది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్.. హాలిడే ట్రిప్స్‌తో కనిపించడంతో.. సామ్ మయోసైటిస్‌కు ట్రీట్‌మెంట్ చేయించుకుంటుందా..? లేదా..? అన్న అనుమానం వస్తోంది. చేతిలో ఒక్క సినిమా లేకపోవడంతో.. సోషల్ మీడియాలో ఫ్రీక్వెంట్‌గా కనిస్తిస్తూ.. సందడి చేస్తోంది.