తమన్నా లవ్ మళ్ళీ ఫెయిల్ అయ్యిందా..? విజయ్ వర్మతో విడిపోయినట్టేనా..?
ఇండస్ట్రీలో ఈ మధ్య బ్రేక్ అప్ స్టోరీస్ నడుస్తున్నాయి. ప్రేమలో ఉన్న వాళ్ళు బ్రేక్ అప్ అంటున్నారు. పెళ్ళైన వాళ్ళేమో విడాకులు తీసుకుంటున్నారు.

ఇండస్ట్రీలో ఈ మధ్య బ్రేక్ అప్ స్టోరీస్ నడుస్తున్నాయి. ప్రేమలో ఉన్న వాళ్ళు బ్రేక్ అప్ అంటున్నారు. పెళ్ళైన వాళ్ళేమో విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా తమన్నా కూడా ప్రియుడితో విడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది తమన్నా. తెలుగులో ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించి ఇక్కడ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు విజయ్. ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేశాడు ఈయన. ముఖ్యంగా వెబ్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయ్యాడు విజయ్ వర్మ. తమన్నాతో రిలేషన్ ను ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు. ఇద్దరం డేటింగ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేశారు. బయటికి ఎక్కడికి వచ్చినా కూడా కలిసే వస్తున్నారు తమన్న, విజయ్. దాంతో త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అని వార్తలు కూడా వస్తున్నాయి.
బాలీవుడ్ లో వీళ్ళ గురించి రోజు గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని రోజులుగా తమన్నా, విజయ్ ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. దాంతో ఇద్దరు విడిపోయారనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దానికి తోడు తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంది మిల్కీ బ్యూటీ. దానికి తోడు మొన్నామధ్య ఒక ప్రెస్ మీట్ లో భాగంగా తమన్న గురించి మాట్లాడమంటే విజయ్ వర్మ ఏ మాత్రం స్పందించకపోవడంతో ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయని.. విడిపోయారు అంటూ ప్రచారం ఎక్కువగానే జరిగింది.
దీని మీద ఇద్దరు మాట్లాడకపోవడంతో అందులో నిజం కూడా ఉందని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. ఆ మధ్య ముకేశ్ అంబానీ ముంబైలో మొదలు పెట్టిన జియో వరల్డ్ ప్లాజా మాల్ ఓపెనింగ్ కు తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి వచ్చింది. అయితే కొన్ని రోజులుగా ఈ ఇద్దరి మధ్య తేడాలు మొదలయ్యాయి. తమన్నా, విజయ్ అధికారికంగా విడిపోయినట్లు ప్రముఖ బాలీవుడ్ పత్రిక కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అనుకుంటున్న తరుణంలో.. ఈ బ్రేక్ అప్ తమన్నకు హార్ట్ బ్రేకే.