విశ్వంభర ఇంక ముందుకు కదిలినట్టేనా.. చిరంజీవి ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చా..?

ప్రతి హీరో కెరీర్ లో కొన్ని సినిమాలు ఉంటాయి. అవి తెలియకుండానే లేట్ అవుతూ ఉంటాయి. ఎంత త్వరగా పూర్తి చేయాలి అనుకున్న కూడా ఏదో ఒక విషయంలో అవి ఆలస్యం అవుతూ ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 07:08 PMLast Updated on: Apr 12, 2025 | 7:08 PM

Has The Universe Moved Further

ప్రతి హీరో కెరీర్ లో కొన్ని సినిమాలు ఉంటాయి. అవి తెలియకుండానే లేట్ అవుతూ ఉంటాయి. ఎంత త్వరగా పూర్తి చేయాలి అనుకున్న కూడా ఏదో ఒక విషయంలో అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. సినిమాలో పెద్ద హీరో ఉన్న.. కావాల్సినంత బడ్జెట్ ఉన్న.. పెద్ద నిర్మాతలు హ్యాండిల్ చేస్తున్న.. ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న అవి లేటవుతూనే ఉంటాయి. చిరంజీవి కెరీర్లో కూడా అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా విశ్వంభర కూడా అదే లిస్టులో చేరిపోయింది. అప్పుడెప్పుడో 2024 నవంబర్ లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న కూడా ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు. సంక్రాంతికి రావాలనుకున్నా.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం తన సినిమా వాయిదా వేసుకున్నాడు చిరంజీవి. దాంతో పాటు సినిమాలో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగాలేవు అని మరోసారి దాని మీద రీ వర్క్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు మళ్లీ యాడ్ చేశారు. సెకండ్ హాఫ్ లో కనెక్టివిటీ మిస్ అవుతుందని.. ప్రత్యేకంగా మళ్ళీ రెండు మూడు సన్నివేశాలు ఈ మధ్య షూట్ చేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన బజ్.. టీజర్ విడుదల తర్వాత కనిపించట్లేదు అనేది కాదనలేని వాస్తవం.

సినిమాలో విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉన్నాయని.. ఇంత అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఉన్న టైంలో కూడా ఏదో తూతూ మంత్రంగా గ్రాఫిక్స్ పూర్తి చేయడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. అక్కడి నుంచి మొదలు ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రాలేదు. ఇన్ని రోజుల తర్వాత సినిమా నుంచి మొదటి సింగిల్ వచ్చింది. దాంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కనీసం ఇప్పటి నుంచి అయినా ప్రమోషన్స్ వేగంగా చేయండి అంటున్నారు. చిరంజీవి వరకు ఈ కంప్లైంట్ వెళ్ళింది. అందుకే ఆయన కూడా ఇకమీద ప్రమోషన్స్ విషయంలో అసలు లేట్ చేయకూడదు అని టీంకు ఆదేశించినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు రెగ్యులర్గా కంటెంట్ రిలీజ్ చేయాలి అనేది ఆయన నుంచి వెళ్లిన ఆర్డర్. నిజానికి మే 9న ఈ సినిమా విడుదల చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆ డేట్ కు సినిమా రావడం అసాధ్యం. అందుకే ఇంద్ర రిలీజ్ అయిన జూలై 24న విశ్వంభర విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి తగ్గట్టుగానే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఎలాగూ షూట్ అయిపోయింది.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా జరుగుతుంది.. గ్రాఫిక్స్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి.. అందుకే అనుకున్న టైం కు సినిమాను విడుదల చేయుచ్చని నమ్మకంగా కనిపిస్తున్నారు.

ఈ సినిమా విషయంలో రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు చిరంజీవి. ఎందుకంటే ఈయన గత సినిమా భోళా శంకర్ దారుణంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా రెండో రోజే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ మధ్య కాలంలో చిరంజీవి ఇంత పెద్ద ఫ్లాప్ చూడలేదు. అందుకే నెక్స్ట్ రాబోయే సినిమా ఖచ్చితంగా బాగుండాలి అని కసితో ఉన్నాడు మెగాస్టార్. కావాల్సినంత టైం తీసుకోండి కానీ అరకొర ఔట్ పుట్ మాత్రం ఇవ్వద్దు అంటున్నాడు. జూలై 24న విశ్వంభర విడుదల దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇందులో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సురభి, ఆషిక రంగనాథ్ లాంటి వాళ్ళు కీలక పాత్రలు చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో చిరంజీవి మళ్ళీ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.