నారా రోహిత్ కు కాబోయే భార్యను చూశారా.. ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు..!
నారా రోహిత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలు కూడా చేయడం లేదు కదా ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు అనే అనుమానం రావచ్చు..

నారా రోహిత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలు కూడా చేయడం లేదు కదా ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు అనే అనుమానం రావచ్చు.. దీనికి కారణం ఆయన తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. ఉగాది సందర్భంగా తన ప్రేయసి, త్వరలోనే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి శిరీషతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నారా రోహిత్. గతేడాది ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఈ జంట. అయితే రోహిత్ జీవితంలోకి రాబోయే ఈ శిరీష అనే అమ్మాయి గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది. అసలు ఎవరు ఈ అమ్మాయి.. అసలు పెళ్లి వద్దు అనుకున్న నారా రోహిత్ జీవితంలోకి శిరీష ఎంట్రీ ఎలా జరిగింది.. ఇలా చాలా విషయాల గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్లు. శిరీషకు ఇంకో పేరు కూడా ఉంది అదే సిరి లెల్ల. ఇండస్ట్రీలో చాలామందికి ఇదే పేరుతో ఆమె తెలుసు. నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది.
అప్పుడే ఇద్దరు ప్రేమించుకున్నారు.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. శిరీష పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వాళ్ల నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్మెన్. ఈమె ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చింది. అక్కడే కొన్ని రోజులు జాబ్ కూడా చేసింది శిరీష. అలా ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నటన మీద ఆసక్తి కలిగి అటువైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రీల్స్ చేసేది. అలా అనుకోకుండా ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నారా రోహిత్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదే ప్రేమకు దారితీసింది.. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు ఈ జంట. తాజాగా ఉగాది సందర్భంగా ఈ ఇద్దరు ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పెళ్లి తేది చెప్పారన్నారు ఈ జోడి.
ఇప్పటికే ఈ ఇద్దరి పెళ్లి అయిపోయేది.. కాకపోతే నారా రోహిత్ తండ్రి రామ్మోహన్ నాయుడు గతేడాది అనారోగ్యం కారణంగా కన్నుమూశాడు. దాంతో ఈ పెళ్లి కొన్ని రోజులు వాయిదా పడింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంది సిరి. ఫ్యూచర్ లో నటిస్తుందా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. మరోవైపు నారా రోహిత్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత వరస సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఈయన. ప్రస్తుతం భైరవం సినిమాలో కీలకపాత్ర చేస్తున్నాడు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు. మొత్తానికి కాబోయే భార్యతో ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు నారావారి వారసుడు.