పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పాట చూసారా..? డాన్సులేస్తున్నాడు మన DCM..!
పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి పాట కాదు.. చిన్న అప్‌డేట్ వచ్చినా బ్రేక్ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నామంటున్నారు అభిమానులు. వాళ్లు ఊహించిన ఓజి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోయినా.. ఎప్పటికప్పుడు ఊహించని విధంగా హరిహర వీరమల్లు నుంచి మాత్రం సర్‌ప్రైజులు ఇస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు.

పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి పాట కాదు.. చిన్న అప్‌డేట్ వచ్చినా బ్రేక్ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నామంటున్నారు అభిమానులు. వాళ్లు ఊహించిన ఓజి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోయినా.. ఎప్పటికప్పుడు ఊహించని విధంగా హరిహర వీరమల్లు నుంచి మాత్రం సర్‌ప్రైజులు ఇస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో పాట విడుదలైంది. మార్చి 28న విడుదల కానుంది ఈ సినిమా. వస్తుందని చెప్తున్నారు కానీ వచ్చేవరకు అయితే అనుమానమే. ఎందుకంటే వీరమల్లును రౌండప్ చేస్తూ చాలా సినిమాలున్నాయి. మార్చి 27న లూసీఫర్ 2, వీరధీరశూరన్ 2తో పాటు మార్చి 28న రాబిన్ హుడ్, 29న మ్యాడ్ స్క్వేర్ రానున్నాయి.
వీటన్నింటి మధ్యలో హరిహర వీరమల్లు వస్తున్నాడు. పవన్ ఈ సినిమాకు ఇంకా డేట్స్ ఇవ్వలేదనే ప్రచారం జరుగుతున్నా.. కచ్చితంగా అనుకున్న సమయానికి వీరమల్లు దండయాత్ర ఖాయం అంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్ ఇస్తున్నారు. ఇప్పటికే టీజర్స్ వచ్చాయి.. మాట వినాలి పాట వచ్చింది.. ఆ తర్వాత దాని మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఇప్పుడు కొల్లగొట్టినాదిరో అంటూ సాగే లిరికల్ సాంగ్ వదిలారు. పైగా ఈ పాటలో పవన్ కళ్యాణ్ డాన్సులు కూడా చేస్తున్నాడు. వేసింది రెండు స్టెప్పులైనా.. పవన్‌ను చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. పాట కూడా క్యాచీ ట్యూన్‌తోనే ఉంది. ముఖ్యంగా పవన్ అప్పియరెన్స్‌తో పాటు.. అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ ఇందులో కనిపించారు.
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాత. క్రిష్ జాగర్లమూడి సగం సినిమాను తెరకెక్కిస్తే.. ఆ తర్వాత రత్నం కొడుకు జ్యోతికృష్ణ మిగిలిన సినిమాను పూర్తి చేస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్. 16వ శతాబ్ధం నాటి కథతో వస్తుంది ఈ చిత్రం. ఇందులో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే సినిమాపై పెద్దగా హైప్ లేదు.. కానీ విడుదల సమయానికి వచ్చేస్తుందిలే అని నమ్ముతున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్‌ను ప్రమోషన్‌కు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన ఉన్న బిజీలో వస్తాడా అనేది అనుమానమే.