కోయకుండానే కారం పెట్టాడు.. బాలీవుడ్ డైరెక్టర్ మాటతో పూనకాలు…

సందీప్ రెడ్డి వంగనే బాలీవుడ్ కి కరెక్ట్ మొగుడు.. ఈ మాటంది తెలుగు హీరోనో, సౌత్ టెక్నీషయనో కాదు... బాలీవుడ్ టాప్ డైరెక్ట్ నితీష్ తీవారి.. ఇప్పటి వరకు వసూల్ల పరంగా ఇండియా నెంబర్ వన్ అనిపించుకున్న సినిమా దంగల్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 07:15 PMLast Updated on: Mar 25, 2025 | 7:15 PM

He Added Chili Without Cutting It Poonakalu With The Words Of A Bollywood Director

సందీప్ రెడ్డి వంగనే బాలీవుడ్ కి కరెక్ట్ మొగుడు.. ఈ మాటంది తెలుగు హీరోనో, సౌత్ టెక్నీషయనో కాదు… బాలీవుడ్ టాప్ డైరెక్ట్ నితీష్ తీవారి.. ఇప్పటి వరకు వసూల్ల పరంగా ఇండియా నెంబర్ వన్ అనిపించుకున్న సినిమా దంగల్. 2 వేల కోట్ల వసూళ్ల తో టాప్ మూవీ అనిపించుకున్న దంగల్ మూవీని తీసిన నితీష్ తీవారి, సడన్ గా సందీప్ రెడ్డి జపం చేశాడు. యానిమల్ మూవీని సందీప్ రెడ్డ వంగని టార్గెట్ చేసిన బాలీవుడ్ మాఫియాని కోసి కాదు, కోయకుండానే కారం పెట్టాడు. ఇది నిజంగా షాకింగ్ న్యూసే.. ఎందుకంటే అక్కడ తోపు లిరిసిస్ట్ అనుకున్న జావెద్ అక్తర్ సందీప్ మీద కామెంట్ చేశాడు. దిక్కుమాలిన సినిమాలను కూడా సరిగా తీయలేని డైరెక్టర్స్, లేదంటే ఫెమినిస్ట్ పేరతో సడన్ గా నీతులు మాట్లాడే బ్యాచ్ అందరికి ఇదో పెద్ద పంచ్ గా మారింది. అసలే ఇండియన్ సినిమా అంటే తామే అని ఇంతకాలం భ్రమల్లో బతికిన వాళ్లకి, అసలు వాళ్ల స్థానం ఏంటో తెలుగు సినిమా చూపించింది. అదే తట్టుకోలేనకపోతున్న వాళ్లకి, సందీప్ రెడ్డి వంగ పుండు మీద కారంలా మారాడు. అలాంటి తనకి తోటి హిందీ దర్శకుడే సపోర్ట్ చేయటంతో, ఇదో సెన్సేషన్ అవుతోందక్కడ… కొందరైతే ఆ దర్శకుడిని చంపేస్తారు, లేదంటే తొక్కేస్తారని ప్రచారం మొదలుపెట్టారంటే, ఇదెక్కడికి వెళుతుందో అంచనా కూడా వేయలేని పరిస్తితి..

బాలీవుడ్ ఇప్పుడో మూలిగే నక్క, లేదంటే బక్కి చిక్కిన సింహం… ఇంకా నేనే కింగ్ అంటే కుదరని పరిస్థితి…అంతగా తెలుుగ సినిమాలు పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాయి. మలయాళ మూవీలు ఓటీటీలో హిందీ సినిమాలకు చుక్కలు చూపిస్తున్నాయి. మొత్తంగా సౌత్ సినిమాల డామినేషన్ తో హిందీ హీరోలకి, గుర్తింపు కరువైంది. ఒకప్పటి పొగరు లేదు. తమంత తోపులు లేరని గట్టిగా చెప్పుకునే కాన్ఫిడెన్స్ లేదు. ఇలాంటి టైంలో బాలీవుడ్ లో యానిమల్ లాంటి హిట్ పడినా, అది ఓన్ చేసుకోలేని దిక్కుమాలిన పరిస్థితి బాలీవుడ్ వాళ్లది. కారణం అక్కడ దిక్కుమాలిన మూవీలు, వాటిని ప్రోత్సహించే దర్శక నిర్మాతలెక్కువయ్యారని కామెంట్ చేశాడు సందీప్ రెడ్డింది. అసలు సందీప్ రెడ్డి వంగ ఏం మాట్లాడినా, బాలీవుడ్ మొత్తానికి కోసి కారం పెట్టినట్టు మండిపోతారు. పనికట్టుకుని సందీప్ రెడ్డి వంగ సినిమాలను వాళ్లు విమర్శిస్తారు.

సరే ఇది కబీర్ సింగ్ నుంచి యానిమల్ హిట్ వరకు జరుగుతున్న తంతే, కాకపోతే కొత్తగా 2 వేల కోట్ల వసూల్లు రాబట్టిన దంగల్ డైరెక్టర్ సీన్ లోకి వచ్చాడు. దీంతో ఈ వివాదం విప్లవంగా మారేలా ఉంది. ఇండియాలో 2 వేల కోట్ల రికార్డుతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న మూవీ దంగల్, తర్వాత బాహుబలి2, పుష్ప2 ఉన్నాయి. సో డెఫినెట్ గా దంగల్ డైరెక్టర్ నితీష్ తీవారి ఏం మాట్లాడినా దానికో వ్యాల్యూ ఉంటుంది.అందుకే తను సందప్ రెడ్డి సినిమా యానిమల్ ని పొగడటంతో సీన్ మారపోయింది. బాలీవుడ్ ఖాన్లూ, కపూర్లకు మొత్తంగా అక్కడి మూవీ మాఫియాకు పుండు మీద కారం చల్లినట్టైంది. హిందీ వెబ్ సీరీస్ అయిన మీర్జాపూర్ 4 ని డైరెక్ట్ చేస్తారా అంటే, దానికంటే యానిమల్ సీక్వెల్ ని తీయటం చాలా ఉత్తమం అన్నాడు. అంటే మీర్జాపూర్ వెబ్ సీరీస్ ఎంతగా బూతులతో నిండి ఉంటుందో చెప్పకనే చెప్పాడు.

ఇదే మాట గత కొన్ని నెలలుగా సందీప్ రెడ్డి వంగ చెబుతున్నాడు. తన సినిమాలో ఏదో బూతుందంటున్నా టాప్ లిరిసిస్ట్ జావెద్ అక్తర్, అసలు మీర్జాపూర్ చూశాడా అని ప్రశ్నించాడు సందీప్. అందులో ప్రపంచ బూతులన్నీ ఉన్నాయి, ఇంకా తెలుగు డబ్బింగ్ వర్షన్ లో బూతులైతే వినలేం. ముందు అలాంటి వెబ్ సీరీస్ లు మీ కొడుకు ఫర్హాన్ అక్తర్ తీయకుండా ఆపండి అని, పేర్లతో సహా చెప్పాడు. దానికే బాలీవుడ్ బ్యాచ్ కి సౌండ్ లేదు. అసలు లిరిసిస్ట్ జావెద్ అక్తర్ కి కౌంటర్ వేయటానికే కాదు, తనని ప్రశ్నించడానికే
బాలీవుడ్ బ్యాచ్ కి వంట్లో వణుకు. అలాంటి లిరిసిస్ట్ కి సందీప్ రెడ్డి చుక్కలు చూపిస్తే,సందీప్ రెడ్డి వంగనే కరెక్ట్ అనేలా దంగల్ డైరెక్టర్ అనటం వైరలౌతోంది. సందీప్ కి సోషల్ మీడియాలో పొగడ్తల వర్షంకురవటంతో హిందీ స్టార్స్ కి మండిపోతోంది.