కల్కీని టచ్ కూడా చేయలేకపోయాడు.. ఇంకా నాన్ బాహుబలి రికార్డా..?
పుష్ప 2 తెలుగులో ప్రివ్యూ రాగానే బ్లాక్ బస్టర్ అన్నారు. కాని గురువారం టాక్ వీకైంది. మూడు సీన్ల ముచ్చట తప్ప ఇందులో ఏం లేదన్నారు. కాని ఎంతగా నెగటీవ్ టాక్ వచ్చినా కొన్ని సార్లు ప్లాప్ మూవీలు కూడా భారీ ఓపెనింగ్స్ ని రాబట్టే ఛాన్స్ఉంది. అంతా ఆ సినిమాకున్న క్రేజే కారణం.
పుష్ప 2 తెలుగులో ప్రివ్యూ రాగానే బ్లాక్ బస్టర్ అన్నారు. కాని గురువారం టాక్ వీకైంది. మూడు సీన్ల ముచ్చట తప్ప ఇందులో ఏం లేదన్నారు. కాని ఎంతగా నెగటీవ్ టాక్ వచ్చినా కొన్ని సార్లు ప్లాప్ మూవీలు కూడా భారీ ఓపెనింగ్స్ ని రాబట్టే ఛాన్స్ఉంది. అంతా ఆ సినిమాకున్న క్రేజే కారణం. అలా చూస్తే కల్కీ, దేవర, సలార్ మాత్రమేకాదు బాహుబలి 2 రికార్డులు కూడా పుష్ప2 బ్రేక్ చేసిందన్నారు. ఆల్రెడీ మొదటి రోజు వసూల్ల లిస్ట్ వచ్చింది. ఎక్కడా కూడా కల్కీ, దేవర రికార్డులనే ఈ సినిమా టచ్ చేయలేకపోయింది. ఓపెనింగ్స్ విషయంలో కల్కీ, దేవరనే టచ్ చేయలేదు, ఇక బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేయటం అనేది ఆల్ మోస్ట్ అసాధ్యం.. అదే తేలింది… అంటే నాన్ బాహుబలి అనే లైనే లేకుండా పుష్పరాజ్ చేస్తాడనటం అత్యాశ అని కన్ఫామ్ అయినట్టేనా?
పుష్ప2 మూవీ కల్కీ, దేవర తాలూకు యూఎస్ రికార్డులని ఓపెనింగ్ కలెక్సన్స్ తో బ్రేక్ చేస్తుందని భారీ అంచనాలే కనిపించాయి. కాని సీన్ చూస్తే అందుకు రివర్స్ లో ఉంది. కల్కీ మూవీ ఎలాంటి ప్రివ్యూలు లేకుండానే మొదటి రోజు తెలుగు వర్షనే 1.35 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అన్ని భాషల్లో కల్కీ మూవీకి యూఎస్ లో 5.5 మిలియన్ డాలర్లు ఓపెనింగ్స్ రూపంలో దక్కాయి
కాని పుష్ప2 మూవీ యూఎస్ కలెక్షన్స్ చూస్తే, తెలుగు వర్షన్ కి 8 లక్షల డాలర్లు, హిందీ వర్షన్ కి రెండున్నర లక్షల డాలర్ల వసూల్లొచ్చాయి. మొత్తంగా ప్రివ్యూ తో పాటు ఫస్ట్ డే ఓపెనింగ్స్ ని కలిపితే, పుష్పకి 3.7 మిలయన్ డాలర్లే వచ్చాయి
అంటే ప్రివ్యూ లేకుండా డైరెక్ట్ గా వచ్చిన కల్కీ మొదటి రోజే 5.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. సో దీంతో పోలిస్తే కనీసం1. 8 మిలియన్ల డాలర్లు వెనకే ఉంది పుష్ప 2 మూవీ. విచిత్రం ఏంటంటే, యూఎస్ లోకూడా పుష్ప 2 తెలుగు వర్షన్ కి భారీగా రెస్పాన్స్ కనిపించట్లేదు. అంతేకాదు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూకే లో మాత్రం పుష్ప 2 కి సోసోగానే రెస్పాన్స్ ఉంది.
పుష్ప2 కి ఊహించినంత కాకున్నా, యూఎస్ లోనే అంతో ఇంతో బెటర్ టాక్ ఉండటంతో, పోటీకొచ్చే మూవీలు కూడా లేకపోవటంతో కాలం కలిసొచ్చే ఛాన్స్ఉంది. అయినా సెకండ్ డే మాత్రం మార్నింగ్ షోకల్లా ఊహాతితంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. విడుదలైన రెండో రోజే ఈ స్థాయిలో వసూళ్లు డ్రాప్ అయ్యాయంటే, ఇక సోమవారం కలెక్షన్స్ తో పష్పరాజ్ తగ్గుతాడో లేదో తేలే చాన్స్ఉంది.
ప్రజెంట్ తెలుగు లో వసూల్ల పరంగా టాప్ ప్లేస్ లోఉంది బాహుబలి 2. 1850 కోట్లతో ఇప్పటికీ బాహుబలి 2 నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటే, 1350 కోట్ల వసూల్లతో టాలీవుడ్ టాప్ 2 గా త్రిబుల్ ఆర్, 1200 కోట్లలో కల్కీ టాప్ త్రీలో ఉంది. అంటే బాహుబలి 2 రికార్డుని ఇంతవరకు ఎవరూ రీచేకాలేదు. ఇక బ్రేక్ చేయటం ఆల్ మోస్ట్ అసాధ్యంగా మారింది. అలాంటి రికార్డునే లేకుండా పుష్ప2 చేస్తుందన్నారు. దానికి కారనం సినిమా మీద పెరిగాన క్రేజ్, అలానే రిలీజ్ కిముందే 1000 కోట్ల బిజినెస్ జరగటంతో, ఈజీగా 2 వేల కోట్లు రాబడుతుందన్నారు. కాని టాక్ చూస్తుంటే ప్రీరిలీజ్ ఎమౌైంట్ వెయ్యికోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించటమే కష్టమయ్యేలా కనిపిస్తోంది.