కీర్తి సురేష్ కాబోయే భర్త అతడే, అసలు ఎవరీ ఆంటోని తట్టిల్…?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. కెరీర్ సవ్యంగా సాగకపోవడంతో ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడానికి రెడీ అయింది ఈ మలయాళ కుట్టీ.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. కెరీర్ సవ్యంగా సాగకపోవడంతో ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడానికి రెడీ అయింది ఈ మలయాళ కుట్టీ. తన ప్రియుడు ఆంటోని తట్టిల్ ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఆమె వివాహానికి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్… అనిరుద్ ను ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
కాని 15 ఏళ్ళ నుంచి ఆమె రిలేషన్ షిప్ లో ఉన్న ఆంటోనిని వివాహం చేసుకోవడానికి రెడీ అయింది కీర్తి. వచ్చే నెల 11, 12 తేదీల్లో ఈ వివాహం గోవాలో గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా గ్రాండ్ గా స్టార్ట్ చేసారు. దీనితో అసలు ఎవరీ ఆంటోని తట్టిల్ అంటూ… సోషల్ మీడియాలో కీర్తి ఫ్యాన్స్, సినిమా పిచ్చోళ్ళు జల్లెడ పట్టే పనిలో పడ్డారు. కేరళలోని కొచ్చిలో పుట్టిన ఆంటోని… దుబాయ్ లో వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యాడు. అతనికి కేరళలో కూడా బలమైన వ్యాపారాలు ఉన్నాయి. అతను ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్ అధినేతగా ఉన్నాడు.
ఈ సంస్థ కాస్త వినూత్న ఆవిష్కరణలకు వేదిక అని చెప్తున్నారు. చెన్నైలో ఈ సంస్థను రిజిస్టర్ చేసారు. కైపలత్ హబీబ్ ఫరూక్ అనే మరో వ్యాపారవేత్తతో కలిసి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు ఆంటోని. దుబాయ్, కేరళ మధ్య రెగ్యులర్ గా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆంటోని. అలాగే దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నాయని టాక్. ఇంత బిజినెస్ ఉన్నా సరే అతను మాత్రం లో ప్రొఫైల్ మెయింటేన్ చేసాడు. కీర్తి సురేష్ తో ప్రేమ వివాహం అనగానే ఇప్పుడు ఇండియన్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
స్కూల్ స్టేజ్ నుంచి వీరి మధ్య స్నేహం ఉండగా… కీర్తి సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత… ప్రేమగా మారిందని సన్నిహితులు చెప్తున్నారు. ఆంటోనీ కొచ్చిలో అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నప్పుడు వీరి డేటింగ్ ప్రారంభమైనట్టు తమిళ మీడియా కథనాలు రాసింది. అక్కడి నుంచి కీర్తిని సినిమా రంగం వైపు నడిపించాడు ఆంటోని. ఇక కీర్తి సురేష్, ఆంటోనీ తటిల్ వివాహం వేడుకకు అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరవుతారని తమిళ మీడియా పేర్కొంది. ముందు నుంచి వీరు వివాహం కేరళలో చేసుకోవాలని అనుకున్నారని… అందుకు తగ్గట్టుగానే ఈ వివాహం జరుగుతోందని సమాచారం. ఇక ఈ వివాహానికి మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి నానీ, రానా సహా కొందరు మాత్రమే హాజరు కానున్నారు.