నా లైఫ్ పార్టనర్ అతనే, అలాగే ఉండాలి, ఉన్నాడు, రష్మిక సెన్సేషన్

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది. ఆమె నటించిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్లు కావడంతో పాప ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసేస్తోంది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా కష్టపడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2024 | 06:15 PMLast Updated on: Dec 19, 2024 | 6:15 PM

He Is My Life Partner He Should Be He Is Rashmika Sensation

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది. ఆమె నటించిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్లు కావడంతో పాప ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసేస్తోంది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా కష్టపడుతోంది. నటనపై అలాగే భాషలపై కూడా ఫోకస్ పెడుతూ డైరెక్టర్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో కూడా బిజీబిజీగా గడుపుతుంది. గత ఏడాది యానిమల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన ఈ ఏడాది పుష్ప 2 సినిమాతో పాన్ వరల్డ్ హిట్ కొట్టింది.

ఈ సినిమాతో ఈ అమ్మడు రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇక రెమ్యూనరేషన్ కూడా పెంచే ఛాన్స్ కనబడుతోంది. ఇదే టైంలో చిన్న సినిమాలు కూడా చేసేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన సికందర్ సినిమాలో రష్మిక నటిస్తోంది. అయితే రష్మిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్లు వైరల్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఆమె వివాహం జరిగే ఛాన్స్ ఉందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. వీళ్లిద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందని ఆ లవ్ ట్రాక్ ఇప్పుడు మ్యారేజ్ వరకు వెళ్లే ఛాన్స్ ఉందని రీసెంట్ గా రూమర్స్ స్టార్ట్ అయింది.

ఇక రష్మిక కూడా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండటంతో జనాల్లో కూడా దీనిపై అనుమానాలు బలపడ్డాయి. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి పుష్ప సినిమా కూడా చూసేసింది రష్మిక. తాజాగా తన లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలో అంటూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది ఈ అమ్మడు. నా లైఫ్ పార్టనర్ నా జీవితంలో ప్రతి దశలోను తోడుగా ఉండాలని ఎల్లవేళలా తనకు సెక్యూరిటీ ఇవ్వాలని… జీవితంలో కష్ట సమయంలో తనకు సపోర్ట్ చేయాలంటూ తన మనసులో మాట బయట పెట్టింది.

అలాగే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలని ఇది మాత్రం పక్కాగా ఉండాల్సిందే అని… తనపై ఎక్కువగా కేరింగ్ ఉండాలని స్పష్టంగా చెప్పేసింది. మంచి మనసు ఉండాలని ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసి ఉండొచ్చని తను ఒపీనియన్ షేర్ చేసుకుంది. ఇక లవ్ గురించి మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరికి తోడు కావాల్సిందే అని నా దృష్టిలో ప్రేమలో ఉంటె పార్టనర్ ఉన్నట్టే అని… తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదని మన ఒడిదుడుకుల్లో మనతో సపోర్ట్ చేసేవారు ఉండాలి అంటూ రష్మిక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అయితే 2025లో విజయ్ దేవరకొండ ను ఈమె పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని టాలీవుడ్లో న్యూస్ వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండకు వయసు పెరిగిపోవడంతో ఇక లేట్ చేయవద్దు అనే భావనలో ఫ్యామిలీ కూడా ఉన్నారట. ప్రస్తుతం తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ఈమె నటిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రానుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా లో రష్మిక లీడ్ రోల్ ప్లే చేస్తోంది.