నా లైఫ్ నాశనం చేసిన త్రివిక్రమ్ ను వాడే కాపాడుతున్నాడు.. రెచ్చిపోయిన పూనమ్ కౌర్
టాలీవుడ్ మాజీ హీరోయిన్ పూనం కౌర్ చేసే కామెంట్స్ అప్పుడప్పుడు సెన్సేషన్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆమె పెడుతున్న కొన్ని పోస్టులు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్ గా న్యూస్ లో ఒక రకమైన తుఫాన్ క్రియేట్ చేస్తాయి.
టాలీవుడ్ మాజీ హీరోయిన్ పూనం కౌర్ చేసే కామెంట్స్ అప్పుడప్పుడు సెన్సేషన్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆమె పెడుతున్న కొన్ని పోస్టులు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్ గా న్యూస్ లో ఒక రకమైన తుఫాన్ క్రియేట్ చేస్తాయి. పదేపదే త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు అన్యాయం చేశాడని అతనిపై చర్యలు తీసుకోవడానికి టాలీవుడ్ పెద్దలు భయపడుతున్నారంటూ ఆమె కామెంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా జానీ మాస్టర్ రేప్ కేస్ వ్యవహారం సమయంలో కూడా ఆమె ఇలాగే కామెంట్స్ చేసింది.
దీనికి సంబంధించి ఇప్పటికే సినిమా పరిశ్రమ పెద్దలతో పాటుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు గతంలో ఆమె బయట పెట్టింది. అయితే ఆమె చేసే వ్యాఖ్యలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో ఎప్పుడు రియాక్ట్ కాలేదు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న సరే చూసి చూడనట్లే ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కొన్నిసార్లు ఆమె పెడుతున్న పోస్టులు వివాదం అవుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
ఇక ఇప్పుడు మరోసారి పూనం సోషల్ మీడియాలో చెలరేగిపోయింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చాలాకాలం క్రితమే తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు తన పోస్టులో రాసుకొచ్చింది. తాను ఫిర్యాదు చేసినా సరే కనీసం అతడి పై విచారణ చేయలేదని.. కనీసం ఇప్పటివరకు అతనికి ఎటువంటి ప్రశ్నలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎదురు కాలేదని పూనం తన పోస్టులో పేర్కొంది. తన ఆరోగ్యం అలాగే సంతోషాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దూరం చేశాడని సెన్సేషనల్ ఆరోపణలు చేసింది.
తన జీవితాన్ని ఇంత నాశనం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పెద్ద తలకాయలు కాపాడుతున్నాయి అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. దీనితో ఇప్పుడు ఆమె పోస్ట్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి సెన్సేషన్ అవుతుంది. కొంతమంది సినిమా ప్రముఖులు ఇటీవల మాట్లాడుతూ ఈ వ్యవహారంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అలాగే పూనం కౌర్ తో మాట్లాడతామంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మళ్లీ దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు. ఇప్పుడు పూనం కవర్ చేసిన సెన్సేషనల్ ఆరోపణలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. అయితే ఆయనను కాపాడే పెద్ద మనుషులు ఎవరు అంటూ… మరి కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.