బాలయ్యకు సరైనోడు ఆయనే… విలనిజం నెక్ట్స్ లెవల్..
బాలయ్యతో బోయపాటి తీస్తున్న మూవీ అఖండ 2... క్యాప్షన్ తాండవం... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా మారకముందు, తనని 100 కోట్ల హీరోగా మార్చింది బోయపాటి శీనునే... సరైనోడుతో తనకి సాలిడ్ మాస్ ఇమేజ్ ని, బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు.

బాలయ్యతో బోయపాటి తీస్తున్న మూవీ అఖండ 2… క్యాప్షన్ తాండవం… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా మారకముందు, తనని 100 కోట్ల హీరోగా మార్చింది బోయపాటి శీనునే… సరైనోడుతో తనకి సాలిడ్ మాస్ ఇమేజ్ ని, బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు. ఇప్పడు బాలయ్యకి సరైనోడినే రంగంలోకి దింపుతున్నాడు. బాలీవుడ్ నుంచి ఒకరు కాదు, ఇద్దరు విలన్లని అఖండ 2 కోసం తీసుకున్నాడు బోయపాటి శీను. అఖండలో నటసిస్తున్నందుకు సంజయ్ దత్ 15 కోట్లు తీసుకుంటుంటే, మరో విలన్ నానాపటేకర్ కూడా రంగంలోకి దిగబోతున్నాడట. ఇది కాకుండా మూడో విలన్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనితెలుస్తోంది. నటసింహానికి విలన్ అంటే అంతకుమించేలా ఉండాలి… అలా చూస్తే ఆల్రెడీ సెలెక్ట్ చేసిన ఇద్దరు విలన్లు కాకుండా, మూడో విలన్ ని తీసుకుంటున్నాడు బోయపాటి.. అలా ముచ్చటగా మూడో విలన్ గా కనిపించబోయే మరో సింహన్ని చూసేయండి…
నటసింహం బాలయ్యతో బోయపాటి అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవం మొదలైంది. సెట్లో సందడి పెరిగింది. ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎంట్రీ కూడా కన్ఫామ్ అయ్యింది. సెకండ్ షెడ్యూల్ నుంచి సంజయ్ దత్ సెట్లో అడుగు పెట్టబోతున్నాడు. ఆల్రెడీ కేజీయఫ్ తో సౌత్ మొత్తం ఫోకస్ అయిన సంజయ్ దత్, డబుల్ ఇష్మార్ట్ శంకర్ లో కూడా విలన్ గా మెరిశాడు.
ఇప్పుడు అఖండ2 లో విలనిజం చూపించబోతున్నాడు. నిజానికి తన కంటే ముందు సరైనోడు ఫేం ఆదిపినిశెట్టినే విలన్ అన్నారు. కాని తన ప్లేస్ లో సంజయ్ దత్ ని తీసుకున్నట్టు ప్రచారం పెంచారు. ఐతే ఇందులో రెండో విలన్ గా నానాపటేకర్ ని కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరాఠా తోపాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన నానాపటేకర్, అమితాబ్ బచ్చన్ సమకాలికుడు.. అలాంటి తను డేట్లు ఇచ్చాడంటేనే షాకింగ్ న్యూస్ అంటున్నారు.
సౌత్ లో రజినీకాంత్ తో తప్ప మరే స్టార్ తో తను కలిసి నటించలేదు. అలాంటి స్టార్ బాలయ్య మూవీ అఖండ2 లో విలన్ అంటే బోయపాటి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్ అంటున్నారు. ఒక వైపు అఘోరా, వర్సెస్ నాగసాధువు కాన్సెప్ట్.. మరో వైపు ఇద్దరు నార్త్ ఇండియా విలన్లు… ఈ రెండు అంశాలు చాలు అఖండ 2 పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయటానికి.. కాని అది సరిపోదనంటున్నాడు బోయపాటి శీను.
ఎందుకంటే తనకి అఖండ తర్వాత స్కంద లాంటి ఊహించని డిజాస్టర్ పడింది. దాన్నుంచి కోలుకునేందుకు పాత అస్త్రం అఖండ నే తీసుకుని, దానికి సీక్వెల్ ప్లాన్ చేశాడు బోయపాటి శీను. అలాంటి తను ఈసారి అంతకుమించేలా ప్లాన్ చేస్తున్నాడు. అఖండ 2 లో ఇద్దరు విలన్లు సరిపోయినట్టు లేరు.. అందుకే నటసింహానికి సరైనోడిని రంగంలోకి దింపుతున్నాడు. నటసింహంతో ఫైట్ కి మరో సింహాన్ని లైన్లోకి తెలుస్తున్నాడు.
ఆ సింహమే నటసింహం బాలయ్య… తన సినిమాలో తానే నెగెటివ్ రోల్ వేయబోతున్నాడట బాలయ్య. జై లవకుశలో అబ్బాయ్ ఇలానే నెగెటివ్ రోల్ వేశాడు. ఇప్పుడు బాబాయ్ వంతొచ్చినట్టుంది. అఖండ2 లో తను కూడా హీరో పాత్రతో పాటు విలన్ గా అంటే, ఇద్దరు హీరోలు, ముగ్గురు విలన్లతో అఖండ 2 తాండవం నెక్ట్స్ లెవల్లో ఉండేలా ఉంది.