Hollywood hero : హాలీవుడ్ హీరోలనే తలదన్నేలా ఉన్నాడుగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఆరడగుల అందగాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రి కృష్ణ అందం ,అభినయం అన్నీ పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు .. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో SSMB 29 చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఇక.. మహేష్ బాబు తనకి ఉన్న ఛార్మ్ కి ఎప్పుడో ఇంటర్నేషనల్ సినిమా రేంజ్‌ నటుడు అన్న పేరు ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2024 | 09:57 AMLast Updated on: Mar 11, 2024 | 9:57 AM

He Looks Like A Hollywood Hero

 

 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఆరడగుల అందగాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రి కృష్ణ అందం ,అభినయం అన్నీ పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు .. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో SSMB 29 చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఇక.. మహేష్ బాబు తనకి ఉన్న ఛార్మ్ కి ఎప్పుడో ఇంటర్నేషనల్ సినిమా రేంజ్‌ నటుడు అన్న పేరు ఉంది. ముఖ్యంగా లుక్స్‌లో మహేశ్ కటౌట్ హాలీవుడ్ హీరోలకు తగ్గని రేంజ్‌లో ఉంటుంది.. ఇండియాలోనే మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరోలలో మహేష్ బాబు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. ఇక అమ్మాయిలకైతే మహేష్‌ కలల రాజకుమారుడు. ఫస్ట్ సినిమాతోనే రాజకుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్.. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. వయసుతో పాటు మహేష్ గ్లామర్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నట్టే ఉంది. ప్రస్తుతం మహేష్ ఏజ్‌ 47 ఏళ్లు.. అయినా పాతికేళ్ల కుర్రాడిలా కనిపించడం సూపర్ స్టార్ స్టైల్.

మహేష్ బాబు హీరోగా ఇప్పుడు జక్కన్న రాజమౌళితో భారీ అడ్వెంచర్ ట్రీట్ చేయనుండగా దీనికి ముందే మహేష్ బాబు హాలీవుడ్ లెవెల్ ట్రీట్ ని ఫ్యాన్స్ కి అందించాడు. ఓ సరికొత్త ఎండోర్స్ మెంట్ యాడ్‌లో తన స్టన్నింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు.. నిజానికి సినిమా హీరోగానే కాదు… ప్రచారకర్తగానూ మహేష్ బాబు సూపర్ స్టారే అన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ పాప్యులారిటీని తమ ప్రొడక్ట్స్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం వాడుకోవడానికి పలు సంస్థలు పోటీ పడుతూ ఉంటాయి. అందుకు తగ్గ ప్రతిఫలాన్నీ పొందుతూ ఉంటాయి. అందుకే బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే జక్కన్నతో మూవీలో మహేశ్ లుక్స్‌పై విపరీతమైన ఆసక్తి పెరిగిపోతున్న టైంలో.. ఓ సరికొత్త ఎండోర్స్ మెంట్ యాడ్ లో కనిపించి తన స్టన్నింగ్ లుక్ మరియు సాలిడ్ ఫిజిక్ తో అదరగొట్టాడు.

ఆ యాడ్‌కు సంబంధిన ఫోటోలను మహేశ్ షోషల్ మీడియాలో షేర్‌ చేయగా.. వాటిని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు ఘట్టమనేని ప్యాన్స్.. అందులో మహేశ్‌ లుక్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సినిమాల్లో కంటే మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్.. ఏం ఉన్నాడ్రా బాబు, అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఇదీ అసలు సిసలైన హాలీవుడ్ కటౌట్ అంటే అంటూ మురిసిపోతున్నారు. హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నేలా జక్కన్న ప్రాజెక్ట్ ఉంటుందని నెట్టింట ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. రీసెంట్ మహేష్ న్యూలుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.