Sai Dharam Tej: సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న సాయి ధరమ్ తేజ్..
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తన ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కొన్ని నెలల పాటు తాను సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతన్నట్టు చెప్పాడు. 2021లో యాక్సిడెంట్‌కు గురైన సాయిధరమ్ తేజ్.. ప్రణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.

He said no to shootings and new project to undergo surgery related to Sai Dharam Tej accident
ఆ తరువాత అతను కోలుకొని సినిమా తీయడానికి చాలా కాలం పట్టింది. విరూపాక్ష సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే అప్పుడు జరిగిన బైక్ యాక్సిడెంట్ నుంచి తేజ్ ఇంకా కోలుకోలేదట. పూర్తిగా కోలుకునేందుకు మరో ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందట. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆ ఆపరేషన్ చేయించుకోబోతున్నట్టు చెప్పాడు తేజ్. అందుకే ఆరు నెలల పాటు ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకోవడంలేదట. తాను మళ్లీ పూర్తిగా కోలుకున్నాను అనిపించిన తరువాతే కొత్త ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాడు.
విరూపాక్ష తరువాత పవన్ కళ్యాణ్‌తో కలిసి బ్రో సినిమాలో నటించాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది. రీసెంట్‌గానే సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న విషయం రివీల్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ఈ విషయం విన్న తేజ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యాక్సిడెంట్ గాయం నుంచి తేజ్ ఇంకా కోలుకోలేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు.