NTR : ఇటుక ఇటుకలో ఎన్టీఆర్‌.. నీ అభిమానం సల్లగుండ..

హీరో హీరోయిన్లకు అభిమానులు ఉండడం కామన్‌. వారిపై తమ ప్రేమను, అభిమానాన్ని చూపించేందుకు, చాటుకునేందుకు ఫ్యాన్స్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ల పేర్లు, ఫోటోలు టాటూలు వేయించుకోవడం.. హీరో, హీరోయిన్ పేరుతో అన్నదానం, రక్తదానం చేయడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అభిమానం చూపిస్తుంటారు. చాలామంది హీరోల ఫ్యాన్స్‌ ఇలానే చేశారు.. సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యారు కూడా ! ఇప్పుడు ఎన్టీఆర్‌ అభిమాని ఒకరు చేసిన పని ఇదీ అంటూ సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2023 | 04:25 PMLast Updated on: Nov 05, 2023 | 4:25 PM

He Wanted Ntrs Name On Every Brick Used In His House It Is Going Viral On Social Media

హీరో హీరోయిన్లకు (heroines) అభిమానులు ఉండడం కామన్‌. వారిపై తమ ప్రేమను, అభిమానాన్ని చూపించేందుకు, చాటుకునేందుకు ఫ్యాన్స్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ల పేర్లు, ఫోటోలు టాటూలు వేయించుకోవడం.. హీరో, హీరోయిన్ పేరుతో అన్నదానం, రక్తదానం చేయడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అభిమానం చూపిస్తుంటారు. చాలామంది హీరోల ఫ్యాన్స్‌ ఇలానే చేశారు.. సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యారు కూడా ! ఇప్పుడు ఎన్టీఆర్‌ అభిమాని ఒకరు చేసిన పని ఇదీ అంటూ సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

YS Sharmila : ఆ పెద్దాయన మాటలు వినే.. షర్మిల పోటీ నుంచి తప్పుకుందా ?

ఎన్టీఆర్‌ (NTR) పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఆ అభిమాని. ఎన్టీఆర్‌ ఫ్యాన్‌బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద ఎన్టీఆర్‌ను ఈ ఎన్టీఆర్‌లో చూసుకుంటూ అభిమానించే వాళ్లు ఎందరో ! ఐతే ఓ అభిమాని ఈ పని చేశారంటూ కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త ఇల్లు కట్టుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్‌.. ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ అనే పేరు వచ్చేలా తయారు చేయించాడు. బట్టీ కార్మికులకు చెప్పి ఎన్టీఆర్ పేరు అచ్చు తో ఇటుకలను రూపొందించారు.

తన ఇంటికి (Brick) వాడిన ప్రతి ఇటుక మీద ఎన్టీఆర్ పేరు ఉండాలని అతడు కోరుకున్నాడట. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కదా ఎన్టీఆర్ అంటే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. నువ్వు సూపర్ బ్రో, నువ్వు కేక బ్రో అంటూ కొందరు తెగ పొగిడేస్తుంటే.. మరికొందరు మాత్రం అసలు సంగతి ఇదీ అంటూ పోస్టులు చేస్తున్నారు. అతను ఎన్టీఆర్ అభిమాని కావొచ్చు కానీ.. కావాలని ఇటుకల మీద ఎన్టీఆర్‌ అని పేరు రాయించలేదని.. ఎన్టీఆర్‌ అనేది ఇటుక బట్టీ కంపెనీ పేరు అని.. ఆ కంపెనీ వాళ్లే ఆ పేరుతో, ఎన్టీఆర్‌ అనే అక్షరాలతో అచ్చు వేసి ఇటుకలు రూపొందించారని కామెంట్లు పెడుతున్నారు. ఏది నిజం.. ఏది అబద్దం అన్న సంగతి పక్కనపెడితే.. ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న ఇటుకలు మాత్రం.. అభిమానుల మనసు గెలుస్తున్నాయి.