Hero Karthi : హీరో కార్తీ.. సీక్వెల్స్ దండయాత్ర..!

దండయాత్ర.. ఇది కార్తీ గాడి సీక్వెల్స్ దండయాత్ర.. అంటున్నాడు హీరో కార్తీక్.. వరుస సీక్వెల్ మూవీస్‌ తో దండయాత్ర చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఈ క్యూట్ హీరో.. నిజానికి ఈ మధ్య కాలంలో హిట్‌ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే చాలా హిట్ సినిమాల సీక్వెల్స్ వచ్చాయి.. అయితే.. ఏ స్టార్ కి అచ్చిరానంతగా.. కార్తీకి మాత్రం సీక్వెల్స్‌ బాగా వర్కౌట్ అవుతున్నాయి.. దీంతో.. ఒకేసారి రెండు సీక్వెల్స్‌తో ఈ ఖైదీ ప్రేక్షకుల ముందు వచ్చేస్తున్నాడు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2023 | 02:14 PMLast Updated on: Nov 19, 2023 | 2:14 PM

Hero Karthi Sequel Invasion

దండయాత్ర.. ఇది కార్తీ గాడి సీక్వెల్స్ దండయాత్ర.. అంటున్నాడు హీరో కార్తీక్.. వరుస సీక్వెల్ మూవీస్‌ తో దండయాత్ర చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఈ క్యూట్ హీరో.. నిజానికి ఈ మధ్య కాలంలో హిట్‌ సినిమాల సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే చాలా హిట్ సినిమాల సీక్వెల్స్ వచ్చాయి.. అయితే.. ఏ స్టార్ కి అచ్చిరానంతగా.. కార్తీకి మాత్రం సీక్వెల్స్‌ బాగా వర్కౌట్ అవుతున్నాయి.. దీంతో.. ఒకేసారి రెండు సీక్వెల్స్‌తో ఈ ఖైదీ ప్రేక్షకుల ముందు వచ్చేస్తున్నాడు..

Mahesh Babu: గూంటూరు కారంలో.. నిప్పులు

కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలోనే సీక్వెల్‌ ను చేస్తామని ప్రకటించారు.. ఇప్పుడు కార్తీ మరో సీక్వెల్‌ తో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. కార్తీ హీరోగా అయిదేళ్ల క్రితం వచ్చిన హిట్‌ ఖాకీ కూడా ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధమైపోతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఖాకీ సినిమాకు అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి.

విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ గా కూడా ఖైదీ మూవీ మంచి విజయాన్ని దక్కించుకుంది.. అందుకే ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడిగా మారిన హెచ్ వినోద్‌ వచ్చే ఏడాది లో ఖాకీ సినిమా సీక్వెల్‌ ను పట్టాలెక్కించే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడు. అదే జరిగితే ఒకే సారి రెండు సీక్వెల్స్ చేస్తున్న హీరోగా కార్తీకి అరుదైన రికార్డ్‌ సృష్టించడానికి రెడీ అయిపోతున్నాడు.. సో.. హీరో కార్తీ సీక్వెల్స్‌తో ఏ రేంజ్‌లో దండయాత్ర చేయబోతున్నాడో అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..