Raja Saab : రాజాసాబ్ విషయంలో ఫేక్ వార్తల్ని నమ్మొద్దు
కల్కి సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు హీరో ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తాజా చిత్రం రాజా సాబ్.

Hero Prabhas is on a good momentum with the success of the movie Kalki. Prabhas, who has gained recognition as a pan India hero and a global hero, is the latest film Raja Saab.
కల్కి సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు హీరో ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తాజా చిత్రం రాజా సాబ్. మారుతి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి వస్తున్న ఫేక్ వార్తల్ని నమ్మవద్దని చిత్ర మేకర్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ ఫేక్ న్యూస్‌పై క్లారిటీ ఇస్తున్నారు.
రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా మలయాళ హీరోయిన్ మాళవికా మోహనన్ నటిస్తోంది. ప్రభాస్‌కు తాతయ్యగా సంజయ్‌దత్ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ నెట్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఆడిషన్స్ లాంటివి ఏమీ జరగడం లేదని చిత్ర మేకర్స్ చెబుతున్నారు. ఎవరూ ఇలాంటి వార్తల్ని నమ్మవద్దని అంటున్నారు. అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా మీడియా ముందుకు వస్తామని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ రాజాసాబ్ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. 2025 సంవత్సరం సంక్రాంతి సీజన్‌లో దీన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతోపాటుగా ప్రభాస్ సలార్2, స్పిరిట్ వంటి సినిమాల్లోనూ తాజాగా నటిస్తున్నారు. ప్రస్తుతం కల్కి 2898ఏడీ (Kalki 2898 AD) చిత్రం కలెక్షన్ల రికార్డుల్ని బద్ధలుగొడుతోంది. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంతా భావిస్తున్నారు.