Lokesh Kanakaraj: ఎల్‌సీయూలో ప్రభాస్ ఎంట్రీ ? క్రేజీ న్యూస్ చెప్పిన లోకేష్ కనగరాజు..
తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలియనివాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ డైరెక్టర్. ముఖ్యంగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.

A Film Plan With Prabhas By Film Director Lokesh Kanakaraj
ఎల్‌సీయూ.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తనకు తానే ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. దీంట్లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఖైదీ సినిమా తీశాడు. ఈ సినిమా కార్తీ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచింది. దాని తరువాత వచ్చిన విక్రమ్ సినిమా బాక్సాఫీవ్ వద్ద దుమ్ములేపింది. ఇదే యూనివర్స్‌లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా లియో సినిమాను తీస్తున్నాడు లోకేష్. ఇలాంటి క్రేజీ డైరెక్టర్ అంతకంటే క్రేజీ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను ప్రభాస్‌తో సినిమా తీయబోతున్నట్టు రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్‌ను ఇప్పటి వరకూ ఎవరూ చూపించనంత గ్రాండ్‌గా చూపించబోతున్నానంటూ చెప్పాడు.
ప్రభాస్‌తో తాను తీయబోయే సినిమా ఇద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోందంటూ హైప్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు చెప్పాడు. ఈ సినిమా కూడా ఎల్‌సీయూలో ఇన్‌స్టాల్‌మెంట్‌గానే ఉంటుందా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-కే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత కూడా రెండు సినిమాలు సైన్ చేశాడు. దీన్నిబట్టి చూస్తే లోకేష్‌తో తీయబోయే సినిమా చాలా లేట్ అయ్యే చాన్స్ ఉంది. ఆ విషయం పక్కన పెడితే లోకేష్ ఎలివేషన్స్, స్క్రీన్-ప్లే మామూలుగా ఉండవు. ప్రభాస్ లాంటి కటౌట్‌కు అలాంటి ఎలివేషన్స్ తోడైతే బొమ్మ ఏ రేంజ్‌లో ఉండబోతోందని ఫ్యాన్స్‌లో అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి. విక్రమ్‌తో దుమ్ములేపిన లోకేష్.. ప్రభాస్‌తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.