Teja Sajja: రెబల్ స్టార్ అంతటి కటౌట్ నే భయపెడుతున్నాడు..
డైనోసార్ ని చూసి మేక భయపడటం కామన్.. కాని మేకని చూసి డైనోసార్ షాక్ అవటం జరుగుతుందా? ఇప్పుడు అదే జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నే ఓ కుర్ర హీరో భయపెడుతున్నాడు.. అదేంటో చూసేయండి.

Prabhas Project K and Teja Hanuman Movie Release On Same date
టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా, ఇది బుజ్జిగాడులో ప్రభాస్ విసిరిన డైలాగ్.. అచ్చంగా ఇలాంటి సీనే రిపీట్ అవుతోంది. సంక్రాంతికి ప్రాజెక్ట్ కే రాబోతోంది. ఈ మూవీ వచ్చే రోజు అంటే జనవరి 12నే హీరో తేజా సజ్జా సినిమా హనుమాన్ రాబోతోంది.అంటే ప్రభాస్ సినిమాతోనే హానుమాన్ మూవీకి పోటీకి దిగుతోందా? అంత గుండే ధైర్యమా అన్న డౌట్లు పక్కన పెడితే, అసలు హానుమాన్ మూవీనే ఇప్పుడు పెద్ద హీరోలను టెన్షన్ పెట్టేలా ఉంది.
ఒక వైపు గుంటూరు కారం జనవరి 13 న రాబోతోంది. ఇక పవన్ కళ్యాణ్ తో సుజీత్ తీసే ఓజీ మూవీ కూడా సంక్రాంతికే వస్తుందంటున్నారు. ఇంత పెద్ద హీరోల సినిమాలు పొంగల్ పోరులోకి దిగుతోంటి, మరో హీరో దార్లోకి రావటం పోటీ ఇవ్వటం అంటే బుల్డోజర్ కి ఎదురెల్లటమే. కాని పాన్ ఇండియా లెవల్లో హానుమాన్ మూవీ రాబోతోంది. గుంటూరు కారంని, పవన్ ఓజీకి ఇది పోటీ అనలేం.. ఎందుకంటే ఈ రెండు సౌత్ కే పరిమితం.. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కే పాన్ ఇండియా లెవల్లో రాబోతోంది. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండస్ట్రీనే షేక్ చేస్తుందని కమల్ హాసన్ లాంటి నటుడే అంటుంటే, ఇప్పుడు ఈ మూవీ టీం హానుమాన్ సినిమాను చూసి భయపడాలా అన్న డౌట్లు రావొచ్చు.